సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా ట్రాన్స్‌జండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా “ ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్ “ ఈ నెల 19th న దేశవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.
ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఈ చిత్ర బృందాన్ని అభినందిస్తూ … ఫిలిం ఛాంబర్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు పి. సునీల్‌కుమార్, ఎల్.బి. శ్రీరామ్‌ని క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రట్రీలు బొకేను అందజేశారు. వల్లూరి రాఘవరావుగారు వ్యాఖ్యాతగా ఆయన చాక చక్యమైన మాటలతో చిత్ర బృందంలోని ప్రతి ఒక్క పాత్ర గురించి ఆయన ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళారు.
ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షులు బత్తుల ప్రసాదరావు మాట్లాడుతూ : నేను ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షుడ్ని అయిన తరువాత ఇది మేము నిర్వహిస్తున్న 12వ కార్యక్రమం. ఈ మధ్య నేను సునీల్‌కుమార్‌రెడ్డిగారు అనుకోకుండా ఒక ఆరుగంటలు ప్రయాణం చేశాము. ఆయన నాకు ఎన్నో ఏళ్ళ నుంచి ముఖ పరిచయం ఉన్నప్పటికీ ..ఆయనతో ఇంత దగ్గరగా కలుసుకోవడం మొదటి సారి మాటల సందర్భంలో సినిమా గురించి తెలుసుకుని ..సార్ ఇలాంటి సినిమాని తప్పకుండా అభినందించాలి …అనుకున్నాను ..ఈ విషయం ఆయనకు చెప్పగానే ఆయన ఎక్కువ సమయం తీసుకోకుండా ఒప్పుకున్నారు. ఆత్మ నూనతకు, ఆత్మ గౌరవానికి మధ్య నలిగిపోతున్న జీవితాలే .. ఈ ఈసినిమాలోని కథ అని అర్థం అయింది. ఇందులో నటించిన నటీనటులందరికీ ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ తరుపున అభినందనలు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షులు సురేష్ కొండేటి మాట్లాడుతూ : సునీల్ కుమార్‌గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఎల్.జి.బి.టి. అనే టైటిల్ మన తెలుగు వాళ్ళకి అర్ధం కాదు కదా అన్నాను. ఇది తెలుగువారికి మాత్రమే కాదు. ఇదొక పాన్ ఇండియా టైటిల్ అన్నారు. ఒక ప్రొడ్యూసర్‌గా, ఒక డిస్ట్రిబ్యూటర్‌గా ఈ రోజులు ఒకే థియేటర్లో ఒక సినిమా 30 రోజులు ఆడటం అనేది గ్రేట్. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ సినిమాకి అన్ని అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అన్నారు.
ముకుంద మాట్లాడుతూ : ఈ మూవీ వస్తుంది అని మేము ఎప్పుడూ కల కనలేదు. నేను కూడా ఒక ట్రాన్స్ జండర్ మహిళకి తల్లినే. నేను ఇలా ఈ అంశంపై మాట్లాడుతాను ఒక వేదికమీద అని అనుకోలేదు. వీరి గురించి ఎవరూ మాట్లాడరు.. ఎవరూ చూడరు. అలాంటిది సినిమాలు తీశారు. రోడ్డు మీదకు వచ్చిన తరువాత వాళ్ళని ఎవరు ఆదరిస్తారు. వాళ్ళకి జరిగే అవమానాలేంటి. స్కూల్ నుంచే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ వీరు హిజ్రాలుగా మారి ఒక సంస్థగా ఏర్పడి వారి సంస్థను కాపాడుకుంటూ వస్తున్నారు. నా బిడ్డ ఈ రోజు ఒక సైంటిస్టుగా వేరే దేశంలో పని చేస్తున్నారు.. నేనే తరిమేశాను. ఈ మూవీ రావడం వల్ల వందశాతం స్కూల్లో పిల్లలు ఎలా అల్లాడిపోతారో చూపించారు. ఈ కమిటీలోని పిల్లలందరూ అదే ఇబ్బందులు పడ్డారు. ఈ సినిమాను స్కూల్ పిల్లలకు చూపిస్తే ఈ సినిమా ఎవేర్నెస్ అనేది వస్తది. తల్లిదండ్రులు పిల్లలతో నిలబడండి వారికి ధైర్యాన్ని నింపండి. దీనిలో ఎవేర్నెస్ తీసుకురండి.
పోలీస్ ఇన్స్‌పెక్టర్ దాసు మాట్లాడుతూ : నా పేరు దాసు నేను 2007 బ్యాచ్ తెలంగాణ ట్రాన్స్‌జండర్ ఆధ్వర్యంలో ఇన్స్‌పెక్టర్‌గా మేము తెలంగాణ స్టేట్ అంతా పని చేస్తున్నాము. వీళ్ళకు సంబంధించి ఏ సమస్య వచ్చినా సాల్వ చేస్తూ వచ్చాము. 99 పర్సెంట్ పబ్లిక్‌కి దీనిపై అవగాహన లేదు. వాళ్ళకి సొసైటీలో ప్రతి ఒక్కదగ్గర ఇబ్బంద్దు్లో ఉన్నారు. వీటిని సునీల్ కుమార్‌రెడ్డి గారు చాలా క్లియర్‌గా చూపించారు. వారికి సరైనా జీవనోపాధి లేక సెక్స్‌వర్క్ ఇలా వేరే.. వేరే.. పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ చిత్రంలో ప్రతీ పాత్ర చాలా అద్భుతంగా ఉంది. దీనికి సంబంధించిన అవేర్నస్ అందరిలో ఉండాలని అందరికీ తెలిసేలా చేస్తున్నాము. వీళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తే వీళ్ళ/ కూడా నేరాలకు పాల్పడరు. అందరూ దయ చేసి అర్ధం చేసుకోగలరు.
ఎల్.బి. శ్రీరామ్ మాట్లాడుతూ : సినిమాలో అయితే జడ్జి స్థానంలో నిలుచున్నాను. కానీ వేదికపైన ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇంత గొప్ప దర్శకుడ్ని ఇంత ఆలస్యంగా గుర్తించడానికి అవమానంగా ఉంది నాకు. ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఈయనను ఎందుకు గుర్తించలేదు అని నాకు అనిపిస్తుంది. నాకు ఆయన సినిమాల్లో అనేక పాత్రలు ఇచ్చారు. చాలా మల్టీ ట్యాలెంటెడ్ ఆయన. జర్నలిజాన్ని సెకండరీగా పెట్టుకుని సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకోవడం అయిపోయింది. తెలుగులో ఇలాంటి సినిమా రావడం అనేది ఒక చరిత్ర అని చెప్పాలి. న్యాయదేవతకి కళ్ళకి గంతలు కడతారు. కానీ ఈ సినిమాలో నాకు కళ్ళకు గంతలు కట్టారు. జడ్జి అనేవాడు కళ్ళు ఎలాగూ ఉండి చూడలేడు కాబట్టి వచ్చింది విని చెప్పాలి. కాబట్టి వినాలి.. వినాలి.. వినాలి ఎంత వింటే అంత న్యాయం జరగాలి. ఈ సినిమా వల్ల ట్రాన్స్ జండర్స్ మీద సదప్రాయం ఏర్పడుతుంది. ఇంత ఉందా వీరి కథా వాళ్ళ ఆచారాలు అవి ఇన్ని ఉన్నాయా అని నాకు ఈ సినిమా ద్వారా తెలిసింది. స్క్రీన్‌ప్లే కాని అన్నీ బావుంటాయి. ఇలాంటి డైరెక్టర్లు చాలా ఎత్తుకు ఎదగాలి. ఇండస్ట్రీ గుర్తించాలి అని కోరుకుంటున్నాను. ఈ కమ్యూనిటీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్నారు. మళ్లీ ఇలాంటి సినిమా వస్తుంది. సీక్వెల్ కూడా ఉంటుంది అది కూడా సునీల్‌గారే తీస్తారు అన్నారు.
తెలంగాణ ట్రాన్స్ జండర్ ప్రెసిడెంట్ లైలా ఓరుగంటి మాట్లాడతూ : ముందుగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌కి థ్యాంక్స్. సునీల్ కుమార్ రెడ్డి సార్ లేకుంటే ఈ రోజు ఈ సినిమా గురించి మాట్లాడుకునేవారు కాదు. నేను ఏమి చేయాలనుకున్నానో అవన్నీ కూడా సొసైటీలో మేము పడుతున్న ఇబ్బందులు. న్యాయ స్థాయనం మాకు ఇచ్చే తీర్పులు ఇవన్నిటినీ చాలా చక్కగా చూపించారు. ఇబ్బందుల్లో ఉండే మాతోనే నటింపచేసి మాతోనే ఇబ్బందులను చెప్పించిన ఘనత పి. సునీల్‌కుమార్‌రెడ్డిగారికి దక్కుతుంది. అందుకు చాలా థ్యాంక్స్ . రాఘవలారెన్స్‌గారు కూడా కాంచన అనే సినిమా తీశారు. కానీ అందులో కాస్త భాగం మాత్రమే చూపించారు. ప్రతి ఒక్కరూ మాకు ఎలాంటి సపోర్ట్ ఇస్తే మేము ముందుకు వెళతాం అన్నఅంశానికి చాలా థ్యాంక్స్ మీడియా తలుచుకుంటే మీ ద్వారా సమాచారం పబ్లిసిటీ అవుతుంది. మా సినిమాకు మరింత ఆదరణ కుదిరి చాలా మందికి ఈ సినిమా చేరువయ్యే అవకాశం ఉంది అన్నారు.
నటుడు ఆనంద చక్రమాపాణి మాట్లాడతూ : రక రకాల పాత్రలు సినిమాలు చేస్తుంటాను. ఏ సినిమా ఏంటి. ప్రజాదరణకి నోచుకుంటుందా. మన చేతుల్లో ఉండదు. ఒక సినిమా పూర్తవడం ఒక ఎత్తు అయితే అది విడుదల కావడం మరో ఎత్తు. పాత్రకి ఆదరణ లభించడం చాలా అరుదు. సునీల్‌గారంంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసే సినిమాలన్నీకూడా సోషల్ ఇష్యూస్ పై ఉంటాయి. కేవలం సమాజం బాగు చేసే సినిమాలు ఎక్కువగా తీస్తారు. ఆయన సినిమాల్లో కమర్షియల్ అన్నది సెకండరీగా ఉంటుంది. ఫస్ట్‌డే షూట్‌లో 20మంది ట్రాన్స్‌జండర్స్ ఉన్నారు. నేను వీళ్ళతో యాక్ట్ చేయాలా అనుకున్నాను. అందరిలాగే నేను కూడా భావించాను. కానీ ఒక ఐదారుగురితో ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాక నాకు వాళ్ళపై ఉన్న అభిప్రాయం మారింది. ఈ సినిమా ఇంత ఆదరణ పొందుతుందని ఎవరూ అనుకోలేదు. కమ్యూనిటీ వారందరూ కూడా సినిమాకి పండగలా వస్తున్నారు. సమాజానికి కమ్యూనిటీ గురించి చెబుతుంది ఈ సినిమా. అక్కడచాలా ఆనందం అనిపించింది. నా సీన్స్ అందరూ థియేటర్లో ఏడవడం చూశాను. చాలా ఆనందం అనిపించింది. థియేటర్ల నుంచి బయటకు వచ్చాక చాలా మంది నన్ను చూసి ఎమోషన్ అయ్యారు. మా ఫాదర్ మీలా ఉంటే బావుండేది అని నన్ను చూసి ఫీలయ్యారు. ఒక నటుడికి అంతకు మించిన గుర్తింపు ఏముంటుంది. పెద్ద పెద్ద సినిమాలే వారం తిరగకుండా వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ సినిమా ఇంత గొప్పగా ఆడడం చాలా ఆనందంగా ఉంది.
నటుడు విష్ణు తేజ మాట్లాడతూ : ఇప్పటికీ కూర్చుని ఆలోచిస్తున్నాను. లైలాగారు, నేను 2018 నుండి రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నాం. ఒక ఫ్యామిలీగా ఒక ఫ్రెండ్‌షిప్‌తోటి ఉన్నాను. నేను ఇండివిడ్యూల్‌గా చదువుకున్నాను. ఈ రోజు గర్వంగా ఉంది ఏమిటంటే ఫిలిం క్రిటిక్స్ వాళ్ళు గౌరవం ఇవ్వడం చాలా థ్యాంక్స్ అన్నారు. మేము పలానా ఎల్‌జిబిటి అని తెలిసి న్యాయస్థానం నుంచి కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం. కొన్ని సినిమాలు చూస్తే మా గురించి తీసే కొన్ని సన్నివేశాలను దానికి సంబంధించిన దర్శకులు కనిపిస్తే వారిని మేం క్రిటిక్స్ అయి వారిని అడగాలనుకుంటాం. అలాంటిది ఈ రోజు మా సినిమాని ఫిలిం క్రిటిక్స్ వారు అభినందించడం చాలా ఆనందించాల్సిన విషయం. చాలా మంది మాపై సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు. ఇక్కడ చెప్పేది ఒకటి అక్కడ చేసేది ఒకటి. కానీ నేను సెట్‌కి వెళ్ళే సరికి లెజండరీ యాక్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. చాలా అద్భుతంగా తెరకెక్కించారు. కేవలం ఒక్కరోజు నిర్ణయించుకుని డైలాగ్స్ మాటలు ప్రతిదీ కూడా ఒక చరిత్ర ఒక అద్భుతం. ఏ స్థాయికి చేరిందంటే ఇది ఒక 30రోజులకి రావడం ఆనందం. దాదాపు 8ఏళ్ళ నుంచి ఫిలిం ఫెస్టివల్స్‌కి నేను గెస్ట్‌గా వెళుతున్నాకానీ. ఎన్నో భాషల సినిమాలు ఉన్నాయి. మన తెలుగు సినిమా లేదు అని బాధపడేవాడిని. ఒక యాక్టివిస్ట్ పీపుల్‌గా మమ్మల్ని ఒక చిన్న భాగం మాత్రమే. గే కి సంబంధించి. ఫ్యామిలీ ప్రెజర్ ఒక అమ్మాయితో పెళ్ళి అయితే ఎలా ఉంటుంది. ఎంత ఇబ్బంది పడతారు ఇవన్నీ చాలా చక్కగా చూపించారు. మీ అందరికీ ధన్యవాదాలు అన్నారు.
హీరోయిన్ సనాఖాన్ మాట్లాడుతూ : నా పేరు సనాఖాన్. ట్రాన్స్ గురించి చాలా మంది చెప్పారు. పర్సనల్లీ మేము ఫాలవుతుంది. బయట సమాజం ఫీలవడం లేదు. ఇప్పుడున్న పీరియడ్‌లో చాలా మంది ట్రాన్స్ ముందుకు వస్తున్నారు. సునీల్‌కుమారెడ్డి వాళ్ళు ఇలాంటి అవకాశాలు ఇవ్వడం వల్ల అందరూ మంచి గా అవుతారని నా కోరిక.
చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ : ఫిలిం క్రిటిక్స్ వాళ్ళు ఇలాంటి ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి చాలా థ్యాంక్స్. ఇలాంటి సినిమా తీసినందుకు నాకు సహకరించిన ముకుంద, దాస్‌గారు చాలా హెల్ప్ చేశాను. అందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. ఈ రోజు యూనివర్స్ లెవల్లో ప్రైవేట్‌కి తీసుకువెళ్ళడం జరిగింది. చాలా యూనివర్సిటీల్లో ప్రైవేట్ స్క్రీనింగ్ గురించి అవడగం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరి ఆదరణకి థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ ఎల్‌బి శ్రీరామ్‌గారు. స్క్రీప్ట్ పూర్తిగా లేకపోతే చేయనంటారు. లైలాగారికి, సనాగారికి థ్యాంక్స్ తర్వలోనే మిమ్మల్ని అందరీనీ కలవాలని కోరుకుంటున్నాను. 2027లో సెకండ్ పార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ మామిడాల గిరిధర్, చందూరమేష్, నవీన్‌కుమార్, కుమారస్వామి జాయింట్ సెక్రటరీ..పర్వీన్‌బాబి సీనియర్ జర్నలిస్టులు.. లక్ష్మణరావు, ట్రేడ్‌గైడ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.