శివరాజ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వెల్కమ్ టు వైల్డ్ లైఫ్ మూవీ పోస్టర్ రిలీజ్

‘నిను వీడని నీడను నేనే’, ‘సింగిల్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన కార్తీక్ రాజు దర్శకత్వంలో ‘కన్నడ సూపర్ స్టార్’, ‘కరుణాడ చక్రవర్తి’ శివ రాజ్ కుమార్ గారు హీరోగా కెవికె ప్రొడక్షన్స్ బ్యానర్ పై కుడిపూడి విజయ్ కుమార్ నిర్మాతగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా వెల్కమ్ టు వైల్డ్ లైఫ్ సంబంధించిన పోస్టర్ శివరాజ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా శివ రాజ్ కుమార్ మరియు గీత శివరాజ్ కుమార్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

పోస్టర్ లో శివరాజ్ కుమార్ గారి లుక్స్ చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. చాలా యంగ్ గా ఒక చేతిలో కెమెరా ఇంకో చేతిలో సింహం పిల్లని పట్టుకుని కనిపిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే మూవీ టీం కొత్తగా ఏదో ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. శివ రాజ్ కుమార్ గారు కూడా కెవికె ప్రొడక్షన్స్ నిర్మాత కుడిపూడి విజయ్ కుమార్ మరియు దర్శకుడు కార్తీక్ రాజ్ తో కలిసి ఒక కొత్త ప్రయోగాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు అని తెలుస్తోంది. ఈ పోస్టర్ ని శివ రాజ్ కుమార్ గారు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా అప్లోడ్ చేశారు.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, రెగ్యులర్ షూట్ అండ్ అప్డేట్స్ గురించి మరిన్ని విషయాలు అతి త్వరలో మన ముందుకు తీసుకురాబోతున్నారు మూవీ టీం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *