ఘనంగా జరిగిన వా టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

శుక్రవారం హైదరాబాద్‌ సిటాడెల్‌ హోటల్‌లో ఘనంగా జరిగిన వా ది ఓజీస్‌ టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ సినీ, వ్యాపారవేత్తల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ సంగీత దర్శకులు కోటి, చేతన్‌ భరధ్వాజ్, సినిమా దర్శకుడు జ్ఞానశేఖర్‌లతో పాటు సింగర్స్‌ శ్రీకృష్ణ, సెలబ్రిటీ లైఫ్‌ స్టైల్‌ గురు నటుడు మోటివేషనల్‌ స్పీకర్‌ ప్రదీప్‌ కొండిపర్తి మార్గ దర్శకత్వం మరియు మెంటార్‌షిప్‌లో జరిగింది. ఈ మహాసంగీత వినోద వేడుక తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ చరిత్రలో ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలకు కొత్త ప్రమాణాలను సృష్టించబోతుంది. కర్టెన్‌రైజర్‌ తర్వాత సంగీత దిగ్గజం కోటి మాట్లాడుతూ–‘‘ ఇలాంటి సంగీతానికి సంబంధించిన కాంటెస్ట్‌ను గతంలో నేను ఎప్పుడు వినలేదు. ఎంతో క్రియేటివిటీతో కూడిన ఈ ఈవెంట్‌కి వచ్చి మా సింగర్స్‌ను కలవటం ఎంతో ఆనందగా ఉంది. ఇలాంటి గొప్ప కార్యక్రమమం నిర్వహిస్తున్న ఎయిరో వాటర్‌ బ్రాండ్, వరాహా గ్రూప్, ఫ్రీడమ్‌ ఆయిల్, యూనియన్‌ బ్యాంక్‌ ఇన్‌ అసోసియేషన్‌ విత్‌ స్పాన్స్‌ ట్రావెల్స్‌ వాకుల సిల్క్స్‌ సద్దిమూట తదితర స్పాన్సర్లందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను వేదికవుతున్న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో మే17 ఆదివారం సాయంత్రం అంత్యాక్షరి ప్రోగ్రాంని నిర్వహిస్తున్నారు. హోస్ట్‌లుగా ప్రముఖ గాయకుడు రేవంత్, నిహారికలు చేయనున్నారు. IPL తరహాలో రూపొందించిన ఈ ప్రత్యేక పోటీలో 6 సెలబ్రిటీ జట్లు పాల్గొంటాయి. ప్రతి జట్టుకు ప్రముఖ బ్రాండ్లు యజమానులుగా ఉండగా, ఐకానిక్ సింగర్స్ నాయకత్వం వహిస్తారు.

టీమ్ ప్రణవం

ఓనర్: ప్రణవ గ్రూప్
లీడర్: ఎస్.పీ. శైలజ

PVNS రోహిత్
మాళవిక
టీమ్ చరణం

ఓనర్: మహా సిమెంట్స్
లీడర్: మల్లికార్జున్

గోపిక
శృతిక
టీమ్ మధురం

ఓనర్: బ్లూ యారో
లీడర్: గీతా మాధురి

దీపు
ఆదితి
టీమ్ వసంతం

ఓనర్: విజన్ VVK
లీడర్: కరుణ్య

సమీరా భరద్వాజ్
వాగ్దేవి
టీమ్ నాదం

ఓనర్: విశిష్ట గోల్డ్ & డైమండ్స్
లీడర్: కల్పన

శ్రీచరణ్
హారిణి
టీమ్ శ్రవణం

ఓనర్: లా కఫైన్
లీడర్: శ్రీకృష్ణ

దామిని బట్లా
అరుణ్ కౌండిన్య

టరరంపం సంగీతం, వినోదం, గ్లామర్, ప్రముఖులు మరియు బ్రాండ్లను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంగీత వినోద కార్యక్రమాలలో ఒకటిగా నిలవడానికి సిద్ధంగా ఉంది.

టికెట్లు బుక్‌మైషోలో అందుబాటులో ఉన్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *