“చెన్నై లవ్ స్టోరీ” హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ – హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ
– స్టీవెన్, నివి పాత్రల మధ్య వచ్చే సంభాషణల్ని ప్రేక్షకులు మర్చిపోలేరు – డైరెక్టర్ రవి నంబూరి
– “చెన్నై లవ్ స్టోరీ”తో కిరణ్ గారికి చాలా మంచి పేరొస్తుంది – స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్
– ప్రీమియర్స్ నుంచే “చెన్నై లవ్ స్టోరీ” మీ ప్రశంసలు పొందుతుంది – ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్
– “చెన్నై లవ్ స్టోరీ” నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ, మా కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం- హీరో కిరణ్ అబ్బవరం
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు “చెన్నై లవ్ స్టోరీ” మూవీ రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు వేడుకలు సందడిగా జరిపారు. ఈ సందర్భంగా
నటి సిరి హన్మంతు మాట్లాడుతూ : “చెన్నై లవ్ స్టోరీ” మూవీలో నటించే అవకాశం దక్కడం హ్యాపీగా ఉంది. ఈ నెల 24న మీరంతా మా సినిమాతో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూడబోతున్నారు. ఇలాంటి మంచి మూవీలో భాగమయ్యే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ : ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న కిరణ్ గారికి హ్యాపీ బర్త్ చెబుతున్నా. మా మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఏడాది అవుతోంది. ఇప్పటిదాకా మీరు ఆ గ్లింప్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి మీరు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మరో వారం రోజుల్లో మా సినిమా రిలీజ్ కు వస్తోంది. ఇప్పుడు మీ సపోర్ట్ ఇంకా అవసరం. సినిమా మొత్తం హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో వదలనే సాంగ్ లీడ్ సీన్ చాలా బాగుంటుంది. అలాగే సెకండాఫ్ లో కొన్ని సీన్స్ మెమొరబుల్ గా ఉంటాయి. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ లో అనేక లేయర్స్ ఉంటాయి. మీరు ఇప్పటిదాకా రిలీజ్ చేసిన నాలుగు పాటలు చూస్తే నాలుగు పాటల్లో ఒక్కోలా కనిపిస్తా. మీరు స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో మా సినిమాలో చూస్తారు. అన్నారు.
కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ : ప్రేమ అనే పదం ఒక్కో టైమ్ లో ఒక్కోలా వినిపిస్తుంటుంది. ఇప్పుడు నాకు ప్రేమ అంటే చెన్నై లవ్ స్టోరీనే. మరో నెల రోజుల వరకు ఈ సినిమానే నా ప్రేమ. అన్నారు
డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ : మా సినిమాలో నివి, స్టీవెన్ శంకర్ క్యారెక్టర్స్ మధ్య అందమైన సంభాషణలు ఉంటాయి. ఈ రెండు పాత్రలకు టైమ్ తీసుకుని మంచి డైలాగ్స్ రాశాం. ఆ స్వేచ్ఛను మా ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. స్టీవెన్, విని పాత్రలు ఒక్కసారి మనకు పరిచయమయ్యాక వారి పాత్ర స్వభావాల నుంచే మాటలు వచ్చేశాయి. నివి, స్టీవెన్ రెండు చాలా బలమైన పాత్రలు. స్టీవెన్ పాత్రను నేను బాగా తీర్చిదిద్దానని పేరొస్తే అది సాయి రాజేష్ గారి మీద నాకున్న ప్రేమకు నిదర్శనం. సాయి రాజేష్ గారు ఈ కథ చెప్పినప్పుడు చెన్నై బ్యాక్ డ్రాప్ అయితే కొత్తగా ఉంటుందని అన్నారు. చెన్నై అయితే ఒక వైబ్ ఉంటుంది అనిపించింది. అన్నారు.
స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ : ఒక స్టార్ తో సినిమా చేస్తున్న ఒత్తిడి మాలో ఏమాత్రం లేదు. అంతా హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నాం. కిరణ్ గారు మాకు అంతమంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ కథ చెప్పినప్పుడే ఆయన మీపై నమ్మకం ఉంది, మీరు ఎంత కమిటెడ్ గా సినిమా చేస్తారో తెలుసు అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ విషయంలోనూ ఆయన జోక్యం చేసుకోలేదు. సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. మా మూవీ చూస్తున్నప్పుడు సెకండాఫ్ లో కిరణ్ గారి పర్ ఫార్మెన్స్ అద్భుతంగా అనిపించింది. ఆయనకు ఈ సినిమాతో చాలా మంచి పేరొస్తుంది. కిరణ్ గారికి బర్త్ డే విశెస్ చెబుతున్నా. వచ్చే ఏడాదిలోపు ఆయన ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు సంపాదించుకోవాలి. నేను రాసిన కథలన్నీ డైరెక్ట్ చేయలేను. బేబి హిందీ వెర్షన్ పనుల్లో ఉన్నాను. అందుకే నా స్నేహితుడు రవికి దర్శకత్వ బాధ్యతలు ఇచ్చాను. బేబి మూవీ టైమ్ నుంచి క్రియేటివ్ గా మా ఇద్దరి వేవ్ లెంగ్త్స్ కుదిరాయి. చెన్నై నగరానికి ఈ కథకు సంబంధం ఉంది. అందుకే టైటిల్ చెన్నై లవ్ స్టోరీ అని పెట్టాం. బేబి సినిమాకు కావాల్సినంత సమయం ఉండేది. విజయ్ బుల్గానిన్ తో ఎక్కువ రోజులు కూర్చుని మంచి ట్యూన్స్ చేయించుకున్నాం. ఇప్పుడు అంత టైమ్ లేదు. తక్కువ టైమ్ లో క్వాలిటీ మ్యూజిక్ మణిగారు ఇస్తారు. అందుకే ఆయనను ఎంపిక చేసుకున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ : మా మూవీలో కిరణ్ గారు, శ్రీ గౌరి ప్రియ ఫెంటాస్టిక్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఇతర పాత్రలు చేసిన ఆర్టిస్టులు కూడా బాగా నటించారు. మణిశర్మ గారి మ్యూజిక్ పెద్ద హిట్ అయ్యింది. నా ఫ్రెండ్ ధీరజ్ మా మూవీకి కావాల్సిన బిజినెస్ వర్క్స్ అన్నీ చూసుకుంటున్నాడు. మా అందరి కెరీర్స్ లో హయ్యెస్ట్ థియేటర్స్ లో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ కాబోతోంది. రవి నంబూరి నా బ్రదర్. పదేళ్లుగా మాతో జర్నీ చేస్తున్నాడు. ఈ సినిమాను అతను అనుభవజ్ఞుడైన దర్శకుడిలా రూపొందించాడు. బేబి సినిమాతో చెన్నై లవ్ స్టోరీని పోల్చడం వల్ల అదనపు ఒత్తిడి మాపై ఏమీ పెరగడం లేదు. బేబి, చెన్నై లవ్ స్టోరీ రెండు భిన్నమైన కథలు. బేబి లాగే ఈ సినిమా కూడా స్ట్రైకింగ్ గా ఉంటుంది. ఈ జానర్ సినిమాలు నచ్చేవారిని చెన్నై లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది. జననాయగణ్ సినిమాను దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. మా సినిమాను మైత్రీ సంస్థ రిలీజ్ చేస్తోంది. దిల్ రాజు వర్సెస్ మైత్రీ అనేది ఏం ఉండదు. ఇద్దరూ మాకు మంచి థియేటర్స్ ఇస్తారని నమ్ముతున్నాం. నెక్ట్స్ ప్రెస్ మీట్ లో వారికి థ్యాంక్స్ చెబుతాం. ఒకే సీజన్ లో రెండు మూడు సినిమాలు ఆడటం చూశాం. వేరే సినిమాలు సక్సెస్ కావాలి, మా సినిమా మరింత పెద్ద విజయం సాధించాలి. మా టీమ్ అంతా సక్సెస్ లో ఉన్నాం. కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నాం. ప్రీమియర్స్ నుంచే మా సినిమాకు మీ ప్రశంసలు దక్కుతాయని ఆశిస్తున్నాం. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ : చెన్నై లవ్ స్టోరీ మరో 9 రోజుల్లో మీ ముందుకు రాబోతోంది. ఈ సినిమా నాకొక మెమొరబుల్ ఫిలిం. నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కొన్నేళ్ల తర్వాత నేను నటించిన చిత్రాల్లో ఏదైనా మళ్లీ చూడాలనుకుంటే ఈ సినిమా చూస్తాను. ఈ సినిమా విజయంపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. మీకు మా మూవీ నచ్చాలి. మా ప్రొడ్యూసర్స్ కు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. వేరే సినిమాల పోటీ ఉన్నా మేము ఈ నెల 24నే రిలీజ్ కు వస్తున్నాం. అందులో సందేహం లేదు. మా మూవీ కంటెంట్ మీద టీమ్ అంతా నమ్మకంతో ఉన్నాం. కంటెంట్ బాగున్న మూవీనే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. సినిమా మీద ప్రేమతోనే నిర్మాత, దర్శకుడిగా మారాను. ఈ ఐదారేళ్లలో మీ దగ్గర నుంచి ఎంతో ప్రేమను సంపాదించుకున్నా. ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు చూశాను. మంచి సినిమాలు చేసి మీ ఆదరణ పొందాలనే నిత్యం ప్రయత్నిస్తున్నాను. ఈ చిత్రంలో ప్యూర్ లవ్ చూస్తారు. సినిమా మొత్తం నేను హీరోయిన్ ను అండి, మీరు అనే పిలుస్తాను. అంత గౌరవిస్తాను. మూవీలో నటిస్తున్నప్పుడు ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించవచ్చా, ఇంతలా ట్రీట్ చేయవచ్చా అనిపించింది. మా మూవీలోని సీన్స్ కు మీరు బాగా రిలేట్ అవుతారు. చెన్నై లవ్ స్టోరీ పాటలు చూసి మీరు క్లాస్ అనుకుంటున్నారు. కానీ ఇది ప్రాపర్ మాస్ మూవీ. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ , వాటి నేపథ్యం సాలిడ్ మాస్ తో ఉంటాయి. డైలాగ్స్, స్టోరీలోని బ్లాక్స్ మాస్ కే ఎక్కువ కనెక్ట్ అవుతాయి. అన్నారు.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, సిరి హన్మంతు, మహేందర్, తదితరులు