కోలీవుడ్ నటుడు జయం రవి దంపతులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు. ఆర్తి పోస్ట్ తర్వాత ఇటీవలే ఒక సుదీర్ఘ లేఖ ద్వారా తన రియల్ లైఫ్‌లో ఏం జరుగుతుందనేది వివరించాడు. తాజాగా ఆయన సతీమణి ఆర్తి కూడా సోషల్ మీడియా వేదికగా మరోసారి ఓ పోస్ట్ పెట్టారు. తామిద్దరం డబ్బు కారణంగానో.. పవర్ కారణంగానో విడిపోలేదని కేవలం మూడో వ్యక్తి కారణంగా విడిపోయామని చెప్పుకొచ్చారు. తానేమీ ఇవన్నీ ఊహించి చెప్పడం లేదని.. తన వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. జయం రవి.. గాయని కెనీషాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. అయితే జయం రవి మాత్రం ఆమెను కేవలం తనకొక మంచి స్నేహితురాలు మాత్రమేనని ఇటీవల లేఖలో పేర్కొన్నాడు. కానీ వాళ్లిద్దరూ కలిసి పెళ్లి వేడుకకు హాజరవడం.. దానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడం ఆ వార్తలకు బలాన్నిచ్చినట్టైంది.
తనను తన తల్లిదండ్రులతో కలవనీయలేదని.. కనీసం తను సంపాదించిన డబ్బును కూడా ఖర్చు పెట్టుకోనివ్వలేదంటూ ఆర్తిపై జయం రవి చేసిన ఆరోపణలపై తాజా పోస్టులో ఆమె స్పందించారు. కేవలం సానుభూతి కోసం పిల్లలను వాడుకోవడం చూస్తుంటే చాలా బాధగా ఉందని.. అసలు ఏ తల్లి అలా చేయదని చెప్పుకొచ్చారు. జయం రవి కెరీర్ కోసం తన కలలతో పాటు మాస్టర్స్ డిగ్రీని సైతం త్యాగం చేశానని.. తనతో జీవితాంతం ఉంటానని ప్రమాణం చేసి మాట తప్పాడని తెలిపారు. ఒకవేళ అతడిని తాను పట్టించుకోకపోయి ఉంటే ఎంతో ఉన్నతంగా జీవించేదాన్నని ప్రీతి తెలిపారు. ఆర్థిక నిర్ణయాలన్నీ ఇద్దరం కలిసే తీసుకున్నామని.. దానికి సంబంధించిన ఆధారాలను సైతం కోర్టులో సమర్పిస్తానని చెప్పుకొచ్చారు.