కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం!

పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్‌ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. వర్షిష్‌ స్టూడియోస్‌ పతాకంపై ఆనంద్‌.కె. దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా హీరో లోమేష్‌ పూడిపెద్ది, హీరోయిన్‌ జయశ్రీ‌, తో పాటు కీలక పాత్రల్లో కనిపించబోతున్న ప్రణీత పట్నాయక్‌, విజ్క్షానిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్‌ నివ్వగా, సక్సెస్‌ఫుల్ నిర్మాత బన్నీవాస్‌ కెమెరా స్వీచ్చాన్‌ చేశారు. ఇటీవల సక్సెస్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌లుగా మారిన నిర్మాతలు ఎస్‌కేఎన్‌, ధీరజ్‌ మొగిలినేని, వంశీ నందిపాటిలు చిత్ర దర్శకుడికి స్క్రీప్ట్‌ను అందజేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు, దర్శకుడు విజయ్‌ కనకమేడల, విఐ ఆనంద్‌లతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ప్రజెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుందని, టైటిల్‌ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయని, త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. లోమేష్‌ పూడిపెద్ది, జయశ్రీ‌, ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, చందు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: చెంచు జింక, నిర్మాతలు పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను, దర్శకత్వం: ఆనంద్‌.కె.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *