మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించిన “చెన్నై లవ్ స్టోరీ” టీమ్

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు “చెన్నై లవ్ స్టోరీ” మూవీ రెడీ అవుతోంది.

ఈ రోజు మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు వేడుకల్ని “చెన్నై లవ్ స్టోరీ” టీమ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, నిర్మాతలు ఎస్ కేఎన్, సాయి రాజేష్, సహ నిర్మాత ధీరజ్ మొగిలినేని, డైరెక్టర్ రవి నంబూరి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మణిశర్మకు బర్త్ డే విశెస్ తెలిపారు. ఈ సినిమాకు మణిశర్మ కంపోజ్ చేసిన ‘తొలి ప్రేమేం తోపు కాదే..’, ‘వదలనే..’,’జిగితార..’, ‘హొయిలా హొయిలా’ పాటలన్నీ ఛాట్ బస్టర్స్ గా మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తున్నాయి.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *