యూకే తెలుగు పీజెంట్ ఈవెంట్ లో మెరిసిన “ఎపిక్” జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య

“బేబి” సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో క్రేజీ జంటగా మారారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ప్రస్తుతం వీరు కలిసి “ఎపిక్” అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తమ సినిమాను లండన్ లో ప్రమోట్ చేసుకుంటున్నారు ఆనంద్, వైష్ణవి. లండన్ లో జరిగిన ప్రతిష్టాత్మక తెలుగు పీజెంట్ లో సెలబ్రిటీ గెస్ట్ లుగా ఆనంద్, వైష్ణవి పాల్గొన్నారు. ఎపిక్ చిత్రంలోని పాటలకు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు వారితో కలిసి ఆనంద్, వైష్ణవి స్టెప్స్ వేశారు.

లండన్ వాసి తెలుగు నటుడు నిర్మాత యష్ రంగినేని, యూకే పార్లమెంట్ లార్డ్ ఉదయ్ నాగరాజు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. మన సంప్రదాయం, ప్రతిభను చాటేలా ఈ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ పీజెంట్ లో విజేతలను అతిథులు సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *