పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు గాయపడిన విషయం తెలిసిందే.
అభిమాన హీరో అల్లు అర్జున్ సినిమా చూడాలని కొడుకు కోరడంతో తల్లిదండ్రులు సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో టికెట్లు బుక్ చేసి తీసుకొని వెళ్లారు.అయితే వీరు వెళ్లిన సమయంలోనే అల్లు అర్జున్ కూడా సినిమా చూడటానికి థియేటర్ కి వచ్చారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయింది.
ఆ కుటుంబానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఇదిలా ఉంటే ఈ కేసులో అల్లు అర్జున్ ని A 11 ముద్దాయిగా చేర్చారు. శుక్రవారం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని జైలుకి తరలించారు. అయితే అప్పటికే హైకోర్టులో మధ్యంతర బెయిల్ కి పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేసింది.
కానీ బెయిల్ కాపీ నిర్ధేశించిన సమయం కంటే ఆలస్యంగా అధికారులకి అందడంతో ఆ రాత్రి అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. జైల్లో అతనికి ప్రత్యేక గది కేటాయించారు.
అలాగే రాత్రి భోజనంగా వెజిటేరియన్ మీల్ ఇచ్చారంట. బన్నీ భోజనం చేసి తనకి కేటాయించిన గదిలోనే రిలాక్స్ అయ్యారని తెలుస్తోంది. జైల్లో ఉన్న సమయంలో అల్లు అర్జున్ ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాలేదంట.
చాలా ప్రశాంతంగా ఉన్నారని జైలు అధికారులు చెప్పినట్లు సమాచారం. ఉదయం అల్లు అర్జున్ ని విడుదల చేశారు. అయితే ఒక రాత్రంతా అల్లు అర్జున్ ని జైల్లో ఉంచడంపై ఆయన తరుపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు బెయిల్ ఉత్తర్వులు అందుకున్న తర్వాత కూడా జైలు అధికారులు సరిగా స్పందించలేదని, కావాలని అతన్ని జైల్లో పెట్టారని అంటున్నారు. అయితే నిబంధనల ప్రకారం నిర్ధేశించిన సమయం లోపు బెయిల్ కాపీలు తమకి అందలేదని, రాత్రి 11:30 గంటలకి బెయిల్ ఉత్తర్వులు అందాయని జైలు అధికారులు అంటున్నారు
దీనిపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అల్లు అర్జున్ ని ఒక రాత్రంతా అయితే జైల్లో ఉంచారు. సాధారణ ఖైదీగానే అతను జైలులో బన్నీ ఒక నైట్ స్పెండ్ చేశారు. వారు ఇచ్చిన ఫుడ్ తిని రిలాక్స్ అయ్యారు.
అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలలో ఈ తరహాలో ఎవరిని అరెస్ట్ చేయలేదు. దీంతో అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయ రంగు పులుముకుంది. మరి ఈ కేసు వివాదం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
సంజు పిల్లలమర్రి