అయ్యప్ప సేవలో తరించిన జీవితం: నండూరు సత్యనారాయణ చార్యులు గారి కథ

సనత్ నగర్ హనుమాన్ దేవస్థానం లోని అయ్యప్ప దేవాలయంలోని ప్రధాన పూజారి కధ. సూర్యోదయం కంటే ముందే నండూరు సత్యనారాయణ చార్యులు గారి (ప్రధాన పూజారి) దినచర్య మొదలవుతుంది. ఆయన శరీరం అలసటను ఎరుగదు, మనస్సులో ఒక్కటే ధ్యాస – స్వామి అయ్యప్ప సేవ.
నండూరు సత్యనారాయణ చార్యులు గారి కుటుంబం గత 30 సంవత్సరాలుగా ఈ పవిత్ర సేవలోనే ఉంది. చిన్నప్పటి నుండే ఆయనకు శాస్త్రాలు, మంత్రోచ్ఛారణలు నేర్పబడ్డాయి. ఈ సేవలో నియమ నిష్ఠలు ఎంత కఠినంగా ఉంటాయో, అంతకు మించిన భక్తి అతని ఆత్మలో నిండిపోయింది. ప్రతి సంవత్సరం మండల పూజ మరియు మకరవిళక్కు సమయాలలో లక్షలాది భక్తుల రద్దీ ఉంటుంది, కానీ నండూరు సత్యనారాయణ చార్యులు గారి దృష్టి మాత్రం గర్భగుడిలో వెలిగే దివ్య జ్యోతి పైనే ఉంటుంది.

2025 అనగా ఈ సంవత్సరం ఆయన కొంచం అనారోగ్యానికి గురి అయ్యారు. ఆ సమయంలో కూడా అయ్యప్ప స్వామికి పూజా విధానంలో ఎలాంటి లోటు లేకుండా అన్ని చేసేవాళ్ళు. నండూరు సత్యనారాయణ గారికి అనారోగ్య కాలంలో ఒకరోజు ఆయనకు అయ్యప్ప స్వామి బాలుడు రూపంలో వచ్చి మంచిగా మాటలు చెప్తూ ఆయన ఆరోగ్యం గురుంచి తెలుసుకొని పూజారి గారి చెయ్యి పట్టుకొని గుడిలోపలకి తీసుకెళ్ళి మాయం అయ్యారంట ఎంత వెతికిన కనిపించటం లేదంట ఏంటా అని ఒక్కసారిగా లేచి చూస్తే చీకటి ఎదురుగా ఎవరు లేరు టైం చూస్తే ఉదయం 4 అయ్యింది. అప్పుడు ఆయనకీ స్వామి నీ సేవకి టైం అయ్యింది నేను ఇంకా లేవలేదు రాలేదని స్వయంగా నువ్వే వచ్చావా స్వామి అని పరుగు పరుగున అయ్యప్ప స్వామి గుడికి వెళ్లి తలుపులు తీసి తనివితీరా ఆ స్వామిని దర్శించుకొని ఆయన సేవలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామినే తన దగ్గరకి రప్పించుకున్న పరమ భక్తుడు మన నండూరు సత్యనారాయణ చార్యులు గారు.

కార్తీక మాసం అంటేనే శివ కేశవుల నామస్మరణతో మారుమోగిపోతుంది. ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు ఎంతో ప్రముఖమైనది అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఈ రోజు అనగా నవంబర్ 15 2025 కు ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. అది ఏంటంటే కార్తీక మాసం ఏకాదశి ఉత్తర నక్షత్రం అంటే అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం అంటే ఈ రోజున హరి హరులతో పాటు వాళ్ళ కుమారుడైన అయ్యప్ప కూడా కలిసి వస్తున్నాడు అంటే ఈ రోజు ఎంత విశిష్టమైందో మనం తెలుసుకోవచ్చు.ఇదే రోజున మన నండూరు సత్యనారాయణ చార్యులు గారి పుట్టిన రోజు రావటం ఎంతో మంచి పరిణామంగ చెప్పుకోవచ్చు. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం రోజునే ఆయన పరమ భక్తుడి పుట్టిరోజు రావటం భగవంతుడికి భక్తులంటే ఎంత ఇష్టమో చెప్పటానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఇక ఈ రోజు 68 సంవత్సరాలు పూర్తి చేసుకొని 69 వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన మన నండూరు సత్యనారాయణ స్వామి గారికి ఆ అయ్యప్ప కృపాకటాక్షాలతో నిండునూరేళ్ళు ఆనందంగా గడపాలని కోరుకుం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *