డ్యూ డేట్‌లో పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో విలక్షణ నటుడు సునీల్‌

లోమేష్‌ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ‌ హీరోయిన్‌గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘డ్యూ డేట్‌’ వరిష్‌ స్టూడియోస్‌ పతాకంపై పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్‌.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఏకధాటిగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా ఇటీవల కమెడియన్‌ కృష్ణభగవాన్‌ ‘డ్యూ డేట్‌’ షూటింగ్‌లో జాయిన్‌ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలం విరామం తరువాత కృష్ణ భగవాన్‌ ఈ చిత్రంలో ఓ మంచి పాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో నటుడు సునీల్‌ జాయిన్‌ అయ్యాడు. ఈ చిత్రంలో సునీల్‌ ఓ లాయర్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన కెరీర్‌ల్‌ ఇదొక డిఫరెండ్‌ పాత్రగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటుడు సునీల్‌ పవర్‌ఫుల్‌ లాయర్‌ శేఖర్‌ చంద్రగా కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర సినిమా పెద్ద ఎస్సెట్‌గా ఉంటుంది. ప్రజెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్‌ చుట్టు పూర్తి వాణిజ్య అంశాలతో అల్లుకున్న కథ ఇది. టైటిల్‌ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించండతో పాటు అందర్ని ఆలోచింపజేస్తుంది. హృదయాలకు హత్తుకుంటుంది’ అన్నారు.

లోమేష్‌ పుడిపెద్ది, జయశ్రీ‌, ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, సునీల్‌ కృష్ణ భగవాన్,అక్షర గౌడ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: జవ్వాడి నాయుడు, మాటలు: హరీష్‌ మీనన్‌, ఎడిటర్‌: సత్య గిడుటూరి, డీఓపీ: చెంచు జింక, నిర్మాతలు పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను, దర్శకత్వం: ఆనంద్‌.కె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *