‘క్రైమ్‌ను ఫాలో అయితే జరిగింది మాత్రమే తెలుస్తుంది.. కానీ క్రిమినల్ని ఫాలో అయితే జరగబోయేది కూడా తెలుస్తుంది’ అంటున్నారు రుద్రవనం సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ శివకుమార్. ఇంతకీ ఈ శివ కుమార్ ఎవరు? ఇతను ఎవర్ని ఫాలో కావాలనుకుంటున్నాడనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం అక్టోబర్ 30 నుంచి జీ5లో ప్రీమియర్ కాబోతోన్న ఒరిజినల్ ‘రుద్రవనం పీఎస్’ చూడాల్సిందే.
“Rudravanam” Trailer ▶️https://youtu.be/eauy_w3N7dE
రుద్రవనం ఊరిలో ఓ తల లేని మృతదేహం దొరుకుతుంది. తర్వాత ఓ వ్యక్తి కనిపించకుండా పోతాడు. దీంతో ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఎలాగైనా చేధించాలనుకుంటారు. కేసుని డీల్ చేసే ఎస్ఐ శివకుమార్ ఆ కేసు వెనుక ఉన్న నిజాలను తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ అవినీతి, స్థానిక రాజకీయాలు, ఎన్నో ఏళ్లుగా బయటకు రాని రహస్యాలు వెలుగులోకి వస్తాయి. చివరకు ఈ పోరాటం కేవలం ఓ కేసుకే పరిమితం కాదు.. అది వ్యక్తిగత పోరాటంగా మారుతుంది. పైకి కనిపించే దానికంటే ఎన్నో రహస్యాలను దాచుకున్న ఓ ఊరులో ఉన్న అసలు రహస్యమేంటనేది తెలుసుకోవాలంటే అక్టోబర్ 30 నుంచి జీ5 ఒరిజినల్‌గా స్ట్రీమింగ్ కానున్న 7 ఎపిసోడ్ల తెలుగు మినీ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’ చూడాల్సిందే. విజయదశమి రోజున మేకర్స్ ఈ ఒరిజినల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్లో పోలీసులకు సవాలు విసిరిన కేసు.. దాన్ని వారు ఎలా చేధించారనేలా ఉండే కంటెంట్ ఒరిజినల్‌పై ఆసక్తిని పెంచుతోంది.
శ్రీచక్రమూవీస్ బ్యానర్‌పై శశిధర్ మున్నంగి ఈ సినిమాను తెరకెక్కించారు. తాజ్ సయ్యద్ రైటర్‌గా వర్క్ చేసిన ఈ మినీ సిరీస్‌కు అష్కర్ అలీ సినిమాటోగ్రఫీని అందించారు.
వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న నరేష్ అగస్త్య ఈ సిరీస్‌తో మరోసారి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో బెనర్జీ, శివ ఆలపాటి, సుగాలి సులోని, రమేష్ కోనంబొట్ల, నారాయణ స్వామి, శివాని రెడ్డి, చారు, ప్రీతి సుందర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.