స్టార్ హీరో విశాల్ తన 35వ చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. ఆర్బీ చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిలింస్ తన 99వ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రవి అరసు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు (సోమవారం) లాంఛనంగా ప్రారంభమయ్యాయి. చెన్నైలో సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హీరోలు కార్తీ, జీవాతో పాటు దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య (సిటిజన్), మణిమారన్ (NH4), వెంకట్ మోహన్ (అయోగ్య), శరవణన్ (ఎంగేయుమ్ ఎప్పోదుం) తదితరులు హాజరయ్యారు. సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ చెన్నైలోనే ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.