జీ5 తెలుగులో విలక్షణ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సీజన్లో తొలి ఎపిసోడ్ సాయి పల్లవితో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, థమన్ కాంబోలో సెకండ్ ఎపిసోడ్ వచ్చింది. ఇందులో నటుడు సునీల్ స్పెషల్ గెస్ట్‌గా కనిపించి అలరించారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అతిథిగా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ప్రోమోవిడుదలైంది.. చూస్తుంటే ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా కనిపిస్తోంది. నారా లోకేశ్ పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు..
Promo: https://www.instagram.com/reel/De5yGsZhbFr
స్కూల్ డేస్‌లో అల్లరి.. ఎక్కువగా పనిష్మెంట్లు నాకే!
ఇంటర్వ్యూలో భాగంగా స్కూల్ రోజుల్లో తాను చేసిన అల్లరి పనులను నారా లోకేశ్ సరదాగా గుర్తుచేసుకున్నారు. టీచర్ల నుంచి ఎక్కువ పనిష్మెంట్లు అందుకున్నది తానేనని నవ్వుతూ చెప్పారు. దీంతో నిజంగానే అంత అల్లరి చేసేవారా? అని జగపతిబాబు ప్రశ్నించగా.. తన మామయ్య నందమూరి బాలకృష్ణతో పోటీ పడాల్సి వచ్చేదని లోకేశ్ చమత్కరించారు.
పెళ్లి సమయంలో ఆసక్తికర ఘటనను గుర్తుచేసుకున్న లోకేశ్!
తన పెళ్లి సమయంలో జరిగిన ఓ సరదా సంఘటనను నారా లోకేశ్ గుర్తుచేసుకున్నారు. ఓ రోజు తనను ‘అల్లుడుగారు’ అని పిలవడంతో.. ఏదో ఫిట్టింగ్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారేమోనని వెంటనే అనుకున్నానని సరదాగా చెప్పారు.
బాలయ్యకు కూడా ఒకరంటే భయమేనా?
సినిమాల్లో తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో, మాస్ ఇమేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే నందమూరి బాలకృష్ణ గురించి నారా లోకేశ్ ఆసక్తికరమైన విషయం చెప్పారు. బాలయ్య తన జీవితంలో ఒకే ఒక్క వ్యక్తికి భయపడతారని చెబుతూ, ఈ విషయాన్ని సరదాగా ప్రస్తావించారు.
https://x.com/Zee5South/status/2114620962243268653
బాలయ్య ఐకానిక్ డైలాగ్‌తో అదరగొట్టిన లోకేశ్ ప్రోమో చివర్లో నారా లోకేశ్.. బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాలోని పాపులర్ డైలాగ్‌ను చెప్పి అలరించారు. “ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు!” అంటూ బాలయ్య స్టైల్లో డైలాగ్ చెప్పడంతో ప్రోమో ఆసక్తికరంగా ముగిసింది.
జయమ్ము నిశ్చయమ్మురా సీజన్2లో నారా లోకేశ్ ఇంటర్వ్యూ నవంబర్ 6న ప్రీమియర్ కానుంది. నవంబర్ 8 సాయంత్రం 7గంటల 30 నిమిషాలకు జీ తెలుగు ఛానెల్లో టెలికాస్ట్ కానుంది.
Stills – Posters – Promos:
https://drive.google.com/drive/folders/1T-fKcL2-4Iqu7T98hvyvQpP2FHkiMjMG