Kalaratna Awards :
సీనియర్ జర్నలిస్ట్, రచయిత భగీరథకు కళారత్న అవార్ఢు లభించింది.
ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవార్డును ప్రదానం చేశారు.
తాజాగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా ఉగాది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని భగీరథకు కళారత్న అవార్డును ప్రదానం చేసి అభినందించారు.
భగీరథకు జర్నలిజంలో 45 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన గతంలోనూ ఎన్నో అవార్డులు అందుకున్నారు.
1997, 2001లో రెండు పర్యాయాలు అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో నంది అవార్డులు, 2011లో ఎన్ .టి .ఆర్ . కమిటీ ఉత్తమ జర్నలిస్టు అవార్డు ,
2020లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం , ఢిల్లీ తెలుగు అకాడమీ , వంశీ , కిన్నెర, యువకళా వాహిని, శృతిలయ ,
కమలాకర కళా భారతి , బళ్లారి తెలుగు సంస్కృతీ లాటి సంస్థల నుంచి 20 అవార్డులను భగీరథ స్వీకరించాడు.
అలాగే భగీరథ పలు అవార్డుల కమిటీలకు సైతం సభ్యులుగా వ్యవహరించారు. నంది, జాతీయ సినిమా అవార్డుల కమిటీ , ఆస్కార్ అవార్డుల కమిటీ సభ్యులుగా పనిచేశారు.
ఆయన సంపాదకత్వంలో ఎన్‌టీఆర్ శత జయంతి సందర్భంగా ‘శకపురుషుడు’, ‘తారకరామం’ వంటి గ్రంథాలను వెలువరించారు .
నాగలాదేవి , మానవత, భారతమెరిక, దసరాబుల్లోడు, జమునాతీరం, నిత్య నూతన కథానాయకుడు, మెట్టింటి గడప, సావేరి,
భగీరథ పథం, అక్షరాంజలి , తెలుగు సినిమా ప్రగతి ,మహార్జాతకుడు మొదలైన గ్రంథాలను సైతం రాశారు.
అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో దేవదాయ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్,
కల్చరల్ కమిటీ చైర్మన్ తేజస్వి పొడపాటి, నాటకం అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ జరిగింది.
ఈ సందర్భంగా భగీరథ మాట్లాడుతూ : జర్నలిజంలో తాను చేసిన కృషిని గుర్తించి, ప్రతిష్టాత్మకమైన కళారత్న అవార్డుకు ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకి,
మండలి బుద్ధ ప్రసాద్‌కి, ఎన్‌టీఆర్ సెంటినరీ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్‌కి, నాటక రంగ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకి కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : రీల్ హీరో రియల్ లైఫ్ కష్టాల గురించి తెలిస్తే..
