ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ఎంతోమందిని నవ్వించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత (July 28th ,Tuesday ) 1:52 గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు (హార్ట్ ఎటాక్) రావడంతో మరణించినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు.కూతురి దీనస్థితి..పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి, చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో కన్నుమూయడం చిత్ర పరిశ్రమను మరియు అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.

పావలా శ్యామల ఫోన్ నెంబర్ : :98491 75713

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *