తెలుగువారి ఆత్మ గౌరవం అన్న గారి 29వ వర్ధంతి

రాముడుగా, కృష్ణుడుగా ఇప్పటికీ తెలుగు వారి చేత పూజలు అందుకుంటున్న ఎన్టీఆర్ తెలుగు సినిమా బతికున్నంతకాలం ఆయనను ఎవ్వరు మరువరు.

దాదాపు 200 పైగా తెలుగు సినిమాల్లో వివిధ పాత్రలు చేసి నటసార్వభౌముడుగా ఎన్టీఆర్ తెలుగువారి మనస్సులో చెరగని ముద్రగా ఈ లోకాన్ని విడిచి దాదాపు 29 ఏళ్ళు గడిచిపోయాయి.

1983 లో రాజీకీయాల్లో అరంగేట్రం చేసి కొద్దీ కాలం లోనే (9 నెలలు ) ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ 1996లో చనిపోయారు.

అయితే ఆయన వారసులు ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్టీఆర్ లేని లోటును తీరుస్తూనే ఉన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నటుడు బాలకృష్ణ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకుని మాస్ హీరోగా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ అలరిస్తూనే ఉన్నారు.

మరోవైపు వెర్శటైల్ యాక్టర్‌గా జూనిర్ ఎన్టీఆర్ పేరు తెచ్చుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ యాక్టర్‌గా కూడా పేరు సంపాదించాడు.

ఇక ఎన్టీఆర్ అన్నయ్య కల్యాణ్ రామ్ కూడా సినిమాలు చేస్తూ తాత పేరును నిలబెడుతున్నాడు.

ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు అయన అభిమానులు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ప్రతీ సంవత్సరం ఫాల్గొని నివాళులు అర్పిస్తున్నారు.

ఈసారి కూడా నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మి పార్వతీ వచ్చి తమ భక్తిని చాటుకున్నారు.

మనవళ్లు ఇద్దరు వచ్చి తాత గారిని గుర్తు చేసుకొని పుష్ప గుచ్చాన్ని పెట్టి నివాళులు అర్పించారు.

అన్నా దమ్ములను చూడటానికి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు.

నందమూరి ఫ్యామిలీ మాత్రమే కాదు అటు నారా వారి ఫ్యామిలీ కూడా ఎన్టీఆర్ ఘాటు వద్దకు వచ్చి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తారు.

ఎమోషనల్ అయిన జూ.ఎన్టీయార్

ఇక ఎన్టీయార్ మనవళ్ళు, యాక్టర్స్ అయిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ అయితే పొద్దుపొడవక ముందే ఘాట్ కు చేరుకుని తాతకు శ్రద్ధాంజలి ఘటించారు.

జూనియర్ ఎన్టీఆర్ తాతను తలుచుకుని కొద్దిసేపు ఎమోషనల్ అయ్యారు.

పెద్ద ఎత్తున అభిమానులుకూడా అక్కడకు చేరుకోవడంతో కాసేపు ఆ ప్రాంగంణం అంతా హడావుడిగామారింది.

బాలకృష్ణ నివాళి..

ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ దగ్గర పూలమాలలతో ప్రత్యేక అలంకారం చేశారు.

తెల్లవారుఝాము నుంచి ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఘాట్‌ను సందర్శిస్తున్నారు.

ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని నందమూరి బాలకృష్ణ అన్నారు.

కుటుంబసభ్యులతో కలిసి తండ్రికి నివాళులర్పించారు. బాలకృష్ణతో పాటూ మరొ కొడుకు నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

సంజు పిల్లలమర్రి

Also Read This : ఈ బాధని తట్టుకునే శక్తి ఏ దేవుడు ఇస్తాడు…

Sr Ntr ghat
Sr Ntr ghat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *