Maredumilli Prajaneekam Review : ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం రివ్యూ

 Maredumilli Prajaneekam Review:

సినిమా పేరు : ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం

నటీనటులు : నరేశ్, ఆనంది, శ్రీతేజ్, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్, సంపత్‌రాజ్, రఘుబాబు, షానీ, ఖయ్యూం

సంగీతం : శ్రీచరణ్‌ పాకాల

కమెరా : రామ్‌

మాటలు : అబ్బూరి రవి

నిర్మాత : రాజేశ్‌ దండా, జీ స్టూడియోస్‌

దర్శకత్వం : ఏఆర్‌ మోహన్‌ అండ్‌ టీమ్‌

కథ :

సినిమా స్టార్ట్‌ అవ్వగానే సిటీకి 25 కిలోమీటర్ల దూరంగా ఉండే మారేడుమిల్లి అనే కుగ్రామంలో నివసించే యువకునికి ప్రమాదం జరుగుతుంది.

ఆ యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లటానికి గ్రామంలో నివసించే తోటివారు సాయం చేసిన కూడా సమయానికి ఆసుపత్రికి వెళ్లలేకపోవటంతో ఆ యువకుడు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

రెండుగంటల ముందు ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ యువకుడు ప్రాణం కాపాడగలిగేవారు ఆ ఊరు ప్రజలు. సరిగా అదే సమయంలో ఎలక్షన్‌లు వస్తాయి.

గవర్నమెంట్‌ స్కూల్లో పనిచేసే టీచర్లకు ఎలక్షన్‌ డ్యూటీలు వెస్తారని తెలుసుకదా.

శ్రీనివాస్‌ శ్రీపాద (అల్లరి నరేశ్‌) అనే తెలుగు టీచర్‌ డబుల్‌ యం.ఏ చేసిన ఇంగ్లీష్‌ టీచర్‌ వెన్నెల కిషోర్‌ కలిసి ఎలక్షన్‌ డ్యూటీ మీద అలా ఆ ఊరికి వెళతారు.

సిటీకి కేవలం 25 కిలోమీటర్ల దూరమే అయినప్పటికి ఆ అడవి తల్లిని నమ్ముకుని బ్రతికే అమాయకులు ఆ ఊరివాళ్లు.

అయినా కూడా 248 ఓట్లున్న ఆ ఊరికి వెళ్లిన ఎలక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ శ్రీపాద వారందరిని ఓటు ఎలా వెయ్యాలో ఓటు విలువ ఏంటో తెలియచేసే ప్రయత్నం చేస్తారు.

అయినా కూడా వారంతా కలిసి కట్టుగా ఉండి ఆ ఊరి పెద్ద మాటకు కట్టుబడి ఓటు వేయమని ఖరాఖండిగా చెప్తారు.

ఎలాగైనా సరే నూటికి నూరు శాతం ఓటింగ్‌ జరిపించాల్సిందే అనే కలెక్టర్‌ ఆదేశంతో ఆ ఊరికి వచ్చిన నరేశ్, కిషోర్‌లు మారేడుమిల్లి ప్రజానికంతో ఓటు వేయించారా? లేదా?

గవర్నమెంట్‌ ఆఫీసర్‌లాగా మారేడుమిల్లి వెళ్లిన నరేశ్‌ ఆ ఊరివాళ్లకోసం ఎందుకు నిలబడాల్సి వచ్చింది? చివరకు ఓటింగ్‌ నూటికి నూరు శాతం జరిగిందా అనేది తెరపై చూస్తేనే బావుంటుంది.

విశ్లేషణ :

నరేశ్‌ రూటు మార్చి ‘మహర్షి’, ‘నాంది’ వంటి సినిమాలు చేసి అద్భుతమైన రిజల్ట్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

సినిమా హీరో అంటే ఆరుపాటలు, ఆరు ఫైట్స్‌ కాదు మంచి కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే సంగతిని సినిమా వారందరూ చెప్తున్న మాటే.

కాకపోతే ఆ ఫీట్‌ను ఎంతమంది నిర్వర్తిస్తున్నారు అనే సంగతి రోజు కళ్లారా చూస్తూనే ఉన్నాం. కానీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం టీమ్‌ మాత్రం ఖచ్చితంగా కంటెంట్‌ను నమ్మి సినిమా చేశారు.

అందులో నో డౌట్‌. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా ఎంటర్‌టైనింగ్‌గా డ్రామాని జోడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం’ సినిమా.

అన్నింటికంటే ముఖ్యంగా దర్శకుడు ఏఆర్‌ మోహన్‌ గురించి చెప్పుకోవాలి. ప్రతి ఫ్రేమ్‌ని కూడా ఎంతో పెద్ద దర్శకునిలాగా తెరకెక్కించిన తీరు బావుంది.

నరేశ్‌తో పాటు హీరోయిన్‌ ఆనంది ఎంతో చక్కగా చేశారు. శ్రీతేజ్‌ పాత్ర అయితే సెకండ్‌ హీరోలా ఉంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్‌ సినిమా మొత్తంలో కనిపిస్తూ ఎంటర్‌టైన్‌ చేయటానికి ప్రయత్నించారు.

కలెక్టర్‌గా సంపత్‌రాజ్‌ పాత్ర కూడా చాలాబావుంది.

బలాలు :

కథ చెప్పిన విధానం
ఎంగేజింగ్‌గా ఉండే పాయింట్‌
నటీనటుల పనితీరు
కెమెరా వర్క్‌

మైనస్‌లు :
కొన్ని సీన్లలో సినిమాటిక్‌ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నారు.

బాటమ్‌లైన్‌ : థియేటర్‌కి వెళ్లి ప్రజానికాన్ని హాయిగా చూడొచ్చు..

రేటింగ్‌ 3/5
                     శివమల్లాల

Also Read:UCC bill : ఆ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద బిల్లు

Ajay Bhupathi Interview
Ajay Bhupathi Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *