నేను యం.ఏ థియేటర్‌ ఆర్ట్స్‌ చదివాను– రాజీవ్‌ కనకాల

వైబ్రెంట్‌ గ్లోబల్‌ స్కూల్‌ వేడుకల్లో నటుడు రాజీవ్‌ కనకాల సందడి చేశారు. ఆ స్కూల్‌లో చదువుకున్న విధ్యార్థులకు మంచి మార్కులు రావటంతో స్కూల్‌ అధినేత లోహిత్‌తో కలిసి ఎంతో ఆనందంగా విధ్యార్థులను సత్కరించారు రాజీవ్‌ కనకాల. ఈ సందర్భంగా రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ–‘‘ లోహిత్‌ చాలా మంచి ఉద్దేశ్యంతో విధ్యార్థులకు చక్కని సదుపాయాలతో వైబ్రెంట్‌ గ్లోబల్‌ స్కూల్స్‌ని నిర్వహిస్తున్న తీరు చూసి ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు ఎంతో చలాకిగా చురుకుగా ఉంటేనే చదువుల్లో రాణిస్తారు. ఇప్పటినుండే ఐఐటి ఫౌండేషన్‌కి కావాల్సిన మెళకువలను పిల్లలకు అందిస్తున్న స్కూల్‌ టీచర్స్‌ని యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అన్నారు. వైబ్రెంట్‌ స్కూల్‌ యజమాని లోహిత్‌ మాట్లాడుతూ– ‘పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వారి చదువులకి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను నేను దగ్గరుండి సమకూర్చటం వల్లే హైదరాబాద్‌లో వేలమంది పిల్లలు నగరంలోని మా స్కూల్స్‌లో చదువుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చి మా స్టాఫ్‌తో పాటు మా విధ్యార్థులను వారి తల్లితండ్రులను కలిసి ఎంతో సమయం వెచ్చించిన రాజీవ్‌ కనకాల గారికి థ్యాంక్స్‌’

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *