ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తారక్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదిలా ఉండగా గతంలో ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలుస్తుందని మేకర్స్ వెల్లడించారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. దీంతో పాటు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఇవ్వబోయే సర్‌ప్రైజ్ గురించి కూడా వెల్లడించింది.
ఎన్టీఆర్, నీల్ కాంబో చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఇక ఈ చిత్రం 2026 జూన్25న విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ‘‘ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్‌లో బాక్సాఫీస్ బద్దలయ్యే సమయం కోసం సిద్ధకండి. 25 జూన్ 2026న థియేటర్లలో దద్దరిల్లే శబ్దాలను మీరు వింటారు. మాస్‌లకే మాస్ అయిన ఎన్టీఆర్ పుట్టినరోజున స్పెషల్ గ్లింప్స్‌తో వస్తాం’’ అని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. మొత్తానికి రెండు అప్‌డేట్‌లతో ఎన్టీఆర్ అభిమానులను ఖుషీ చేసింది. స్లో అండ్ స్టడీగా షూటింగ్ కొనసాగనుంది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గి జీరో సైజ్‌లో కనిపిస్తున్నాడు.
ప్రజావాణి చీదిరాల