VN Aditya
ఫణి సినిమా కోసం ఫస్ట్‌టైమ్ ఇన్ ది హిస్టరీ ఐదు రోజుల పాటు ముగ్గురు కెమెరామెన్‌లతో పాములను ఆడిషన్ చేశాం….
‘మనసంతా నువ్వే’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన వి.యన్ ఆదిత్య
చాలాకాలం తర్వాత ‘ఫణి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
డల్లాస్‌లో ఉండే తన చెల్లెలు డాక్టర్ మీనాక్ష్మీ నిర్మిస్తూ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో క్యాథరిన్ థెరిస్సా మెయిన్‌లీడ్‌లో నటిస్తోంది.
అమెరికాలోని డల్లాస్‌లో షూట్ చేసుకున్న పూర్తి తొలి తెలుగు చిత్రం ‘ఫణి’.
ఈ విధంగా కూడా సినిమాకు మార్కెటింగ్ పరంగా ఎంతో హెల్ప్ అవ్వనుంది.
ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ధర్శకేంద్రుడు రాఘవేంధ్రరావు గారి చేతులమీదుగా హైదరాబాద్‌లో విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
దర్శకేంధ్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ : ‘‘ ఆదిత్య అంటే సూర్యుడు.
సూర్యుడు ఇండియాలో ఉదయం ఉండే రాత్రికి అమెరికాలో ఉంటాడు.
ఆదిత్య నన్ను రాజ్‌కుమార్ కంటే గొప్పవాడ్ని అని అన్నారు.
ఆ మాటని నేను ఒప్పుకోను అంటే ఆదిత్య మాట్లాడుతూ రాజ్‌కుమార్‌గారు
ఎంత గొప్పవాడైనా ‘అన్నమయ్య’ తీయలేదు కదా సార్ అనగానే నిజమే కదా అని అప్పుడు నేను కూడా ఒప్పుకున్నాను.
ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ‘ఫణి’ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకోవాలని
ఎనిమిది భాషల్లో ఎనిమిది దేశాల్లో తన సినిమా సూర్యునిలా ఉదయించి
ఆదిత్యకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేస్తున్నాను.
టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను’’ అన్నారు.
హీరోయిన్ క్యాథరిన్ మాట్లాడుతూ : ‘‘ ఈ సినిమాలోని నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.
నాకు కుక్కలంటే చాలా ఇష్టం కానీ, పాములంటే చాలా భయం.
ఈ సినిమా షూటింగ్‌లో నన్ను చాలా కంఫర్టబుల్‌గా ట్రీట్ చేసిన టీమ్‌కి ఆదిత్యగారికి తన సిస్టర్ నిర్మాత మీనాక్ష్మీగారికి చాలా థ్యాంక్స్.
‘ఫణి’ సినిమా థ్రిల్లర్ జానర్‌లో ఉంటుంది. అందుకే నా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది.
సినిమా చూసిన తర్వాత మీరే ఆ మాట చెప్తారు’’ అన్నారు.
నిర్మాత మీనాక్ష్మీ మాట్లాడుతూ : ‘ చిన్నప్పటినుండి అన్నయ్యను చూస్తూ పెరగటంతో సినిమా పరిశ్రమలోని కష్ట సుఖాలను దగ్గరుండి చూశాను.
అమెరికాలో గత 23 సంవత్సరాలుగా సంగీత టీచర్‌గా పనిచేస్తున్నా.
‘ఫణి’ సినిమా చేయటానికి అన్నయ్య ఉన్నాడన్న ధైర్యమే నన్ను, మా ఆయన శాస్త్రిగారిని
‘ఓ.యంజి’ (ఓమ్ని మీడియా గ్రూప్) అనే నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు తీయటానికి ముఖ్యకారణం’ అన్నారు.
దర్శకుడు వి.యన్ ఆదిత్య మాట్లాడుతూ : ‘‘ ఒకరోజు ఉదయమే కాఫీ తాగుతూ కూర్చుంటే అనుకోకుండా
మా చెల్లెలు మీనా మనమే సినిమా ఎందుకు తీయకూడదు అన్నది.
అలా మొదలైన చిన్న ప్రయాణం ఈ రోజు ఇక్కడివరకు వచ్చింది.
ఈ సినిమాలో పాముకు చాలా ప్రముఖ పాత్ర ఉండటంతో దాదాపు 12 పాములను ఆడిషన్ చేయాల్సి వచ్చింది.
చరిత్రలో పాములను ఆడిషన్ చేసిన ఘనత మా సినిమాకే దక్కుతుంది.
అలాగే కథ వినగానే తనకు ఎంతో నచ్చిందని నేను ఈ సినిమా చేస్తున్నానని క్యాథరిన్ చెప్పగానే మా సినిమా రేంజ్ పెరిగిపోయింది.
అలాగే మా సినిమా హీరో హైదరాబాది అయిన మహేశ్ అమెరికాలోనే స్థిరపడిన భారతీయుడు.
అక్కడ మోడల్‌గా యాక్టర్‌గా చేస్తుండటంతో ఆయన్ని మా సినిమాలోకి తీసుకొచ్చాం.
ఇలా ఈ సినిమా మా అందరికి చాలా వెరైటీ ఎక్స్‌పీరియన్స్‌ని మిగిల్చింది.
సినిమా షూటింగ్ అంతా అమెరికాలోనే చేసిన పోస్ట్ ప్రొడక్షన్‌ని ఇండియాలో చేస్తున్నాం.
దాదాపు 8 భాషల్లో మా సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో అమెరికా నుండి వచ్చిన హీరో మహేశ్,
సహనిర్మాత శాస్త్రి, ఏయు అండ్ ఐ నిర్మాణసంస్థ నిర్మాత పద్మనాభరెడ్డి, ఎడిటర్ జునైద్ సిద్ధికి,
మాటల రచయిత పద్మావతి, నటుడు–దర్శకుడు కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
శివమల్లాల
Also Read This : సీనియర్ జర్నలిస్ట్‌కు భగీరథకు కళారత్న అవార్డు