“స్పిరిట్” మూవీ షూటింగ్ అప్డేట్ వెల్లడించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

రెబల్ స్టార్ ప్రభాస్ తో భారీ పాన్ ఇండియా మూవీ “స్పిరిట్” రూపొందిస్తున్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ప్రేక్షకులకు మోస్ట్ అవేటెడ్ మూవీగా మారింది. ఈ క్రేజీ కాంబో మూవీ నంచి ఏ చిన్న అప్డేట్ అయినా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. స్పిరిట్ సినిమా షూటింగ్ 40 పర్సెంట్ కంప్లీట్ అయ్యిందని, ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమా ఉంటుందని ఆయన తెలిపారు.

రీసెంట్ గా అమెరికాలోని నార్త్ కరొలినా, చార్లెటీలో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ లో సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పిరిట్ సినిమా షూటింగ్ అప్డేట్ షేర్ చేసుకున్నారు. ఇదే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..యానిమల్ సినిమాలోని జమాల్ కుడు పాటకు స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *