మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ అస్తమయానికి సంబంధించిన కథతో ‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ అనే టైటిల్‌తో వెబ్ సిరీస్‌ను రూపొందించడం జరిగింది. ఇది ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. దీనిని సోనీ లివ్ అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, కుకునూర్ మూవీస్‌తో కలిసి ఈ రియల్ స్టోరీని రూపొందించింది. ఇది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనిరుధ్య మిత్ర రాసిన బెస్ట్ సెల్లింగ్ పుస్తకం నైన్టీ డేస్ ఆధారంగా రూపొందించబడింది. ఒక ఉత్కంఠభరితమైన పొలిటికల్ థ్రిల్లర్‌గా ఇది రూపొందింది.
జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు సంబంధించిన కథను రోహిత్ బనావాలికర్, శ్రీరామ్ రాజన్‌లు అందించారు. డీఆర్ కార్తికేయన్‌గా అమిత్ సియాల్ (Chief of SIT), అమిత్ వర్మగా సాహిల్ వైద్ (SP-CBI), రగోత్తమన్‌గా భగవతి పెరుమాళ్ (DSP-CBI), డానిష్ ఇక్బాల్‌గా ఆమోద్ కాంత్ (DIG-CBI), గిరీష్ శర్మగా రాధావినోద్ రాజు (DIG-CBI), అంజనా బాలాజీ, బి సాయి దినేష్, శృతి జయన్, గౌరీ మీనన్ తదితరులు నటించారు. ఇంట్రస్టింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ సోనీ లివ్‌లో జూలై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ప్రజావాణి చీదిరాల