8 Vasanthalu: అనంతిక ఈ సినిమాకు డబ్బు అక్కర్లేదని చెప్పింది..

అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘8 వసంతాలు’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్‌ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో మైత్రీ మూవీ మేకర్స్ చాలామంది కొత్తవారికి ఉనికిని ఇచ్చింది. ఇది డబ్బు కంటే చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మా టీం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచి కథ ఉంటే మైత్రిలోకి ఎలాగోలా రావచ్చు. అనంతిక ఈ సినిమా చేయడానికి డబ్బు కూడా అక్కర్లేదని చెప్పింది. టాలెంట్ కంటే ఇలాంటి పాషన్ ఉండడం చాలా గొప్ప విషయం. ఒక 17 ఏళ్ల అమ్మాయికి డబ్బు సంపాదించుకోవడం తెలుసు, వద్దు అనుకోవడం తెలుసు. శుద్ధి అయోధ్య పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఓపెన్ సీక్వెన్స్ మిస్ అవ్వొద్దు. సినిమా అంతా రివర్స్ లో వెళ్తుంది. అందుకే ఓపెనింగ్ సీక్వెన్స్ ఎవరు మిస్ అవ్వద్దు అని కోరుతున్నాను’’అన్నారు

హీరోయిన్ అనంతిక మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు నాలుగైదు సినిమాలు చేశాను. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నా జీవితంలో ఎప్పుడూ లేదు. ఇదంతా ఒక డ్రీమ్ లాగా ఉంది. శుద్ధి లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తానని అని ఎప్పుడూ అనుకోలేదు. యాక్షన్ ఎమోషన్ లవ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇలాంటి రోల్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. విశ్వ గారు చాలా విజువల్స్ ఇచ్చారు. ప్రతి ఫ్రేం ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది’’ అన్నారు.

ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ.. ‘‘అనంతిక ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. క్లాసికల్ డాన్స్, మార్సల్ట్స్ రెండు వచ్చిన అమ్మాయి కావాలని ఇండియా మొత్తం వెతికితే ఒక్క అమ్మాయి దొరికింది.. తనే అనంతిక. ఈ సినిమా ఒక అమ్మాయి జర్నీ. ఒక అమ్మాయి జీవితమే 8 వసంతాల. సినిమా కాశ్మీర్ ఊటీ వారణాసి ఆగ్రా ఇలా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో తీయడం జరిగింది’’ అన్నారు.

ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా డిఫరెంట్ మూవీ. కథ బాగా నచ్చి మేము చేసిన ప్రయత్నం. అందరికీ నచ్చుతుందని నమ్మకం వుంది. చాలా కొత్త టాలెంట్ ఇందులో వర్క్ చేశారు. వాళ్ళందరి కోసం ఈ పెద్ద విజయం సాధించాలి. అందరూ థియేటర్స్ లో సినిమా చూడాలని కోరుతున్నాను’’ అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *