చై-శోభితపై మహేశ్ కోపం.. ఒక్క వీడియోతో ఫుల్ క్లారిటీ..

సాధారణ వ్యక్తుల ఇళ్లలో పెళ్లంటేనే సవాలక్ష లొసుగులు వెదికే లోకమిది. మరి సెలబ్రిటీల ఇళ్లలో పెళ్లంటే వెదకరా? బాడీ అంతా లెన్స్ వేసుకుని మరీ ఎక్కడ ఏం జరిగిందో వెలికితీసి రచ్చ చేస్తారు. అక్కినేని అఖిల్ వివాహ రిసెప్షన్‌లోనూ ఇదే చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి ఈ పెళ్లికి హాజరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ వీడియోలో నాగచైతన్య-శోభిత దంపతులను పలకరించకుండా మహేశ్ ముందుకు వెళ్లిపోయిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

దానిని చూసిన నెటిజన్లు రకరకాల కథనాలు అల్లేశారు. మహేశ్‌కు సమంత మంచి ఫ్రెండ్ అని.. చై-శోభితల వివాహం తనకసలు నచ్చలేదని అందుకే అలా పలకరించకుండా వెళ్లిపోయాడంటూ పెద్ద ఎత్తున కథనాలు.. తీరా చూస్తే తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. దానిలో మహేశ్‌తో పాటు ఆయన సతీమణి నమ్రత, సితార ముగ్గురూ చై-శోభితలను అప్యాయంగా పలకరించారు. చైకు మహేశ్ షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ హత్తుకున్నాడు. శోభితకు సైతం షేక్ హ్యాండ్ ఇచ్చి అప్యాయంగా పలకరించాడు. మొత్తానికి ఈ వీడియోతో కామెంట్స్ చేసిన వారికి గట్టి సమాధానమే దొరికినట్టైంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *