అమీర్‌ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై చాలా సీరియస్‌గా ఉన్నట్టున్నారు. ఈ క్రమంలోనే ‘మహాభారతం’ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పిన అమీర్ ఖాన్.. ప్రస్తుతం తన పాత్ర సహా మరికొన్ని విషయాలను ప్రస్తావించారు. ‘మహాభారతంను రూపొందించడం తన కల అని దీని కోసం చాలా కష్టపడాలని చెప్పారు. ఈ సినిమాలో తాను శ్రీకృష్ణుడి పాత్రల్ నటిస్తున్నట్టు వెల్లడించారు. ఇది తనకు చాలా ఇష్టమైన పాత్ర అని తెలిపారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని.. దీని గురించి ఇంతకు మించి వివరించలేనని తెలిపారు.
గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. దీనిని ఒకటే సినిమాగా తీయడం కుదరదని తెలిపారు. దీని రైటింగ్‌కే కొన్నేళ్లు పడుతుందన్నారు. దీనికి సంబంధించిన పనులను ఈ ఏడాదే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఇక తను నటించిన సినిమాల గురించి అమీర్ మాట్లాడుతూ.. తాను రెమ్యూనరేషన్ తీసుకోకుండానే ఎన్నో సినిమాలు చేశానని.. వాటిలో ‘లాల్ సింగ్ చడ్డా’ ఒకటని తెలిపారు. అయితే తాను లాభాల్లో షేర్ తీసుకుంటానని కాబట్టి సినిమా హిట్ అయితేనే తనకు రెమ్యూరేషన్ వస్తుందని అమీర్ ఖాన్ వెల్లడించారు.
ప్రజావాణి చీదిరాల