సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా సెలబ్రిటీల గురించి రూమర్స్ బాగా పెరిగిపోయాయి. ఏ నటుడితోనైనా నటి కనిపిస్తే చాలు.. ఏదో ఉందంటూ వార్తలు.. ఎవరైనా ఆసుపత్రికి వెళుతూ కనిపిస్తే చాలు.. అనారోగ్యమని… సీరియస్ అని రూమర్స్. ప్రస్తుతం నటుడు ఉపేంద్ర విషయంలోనూ అదే జరిగింది. ఉపేంద్రకు అనారోగ్యమని.. ఆసుపత్రి పాలయ్యారంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. కేవలం సాధారణ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లానంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి పుకార్లతో అయోమయానికి గురవ్వొద్దని.. మీ ప్రేమకు ధన్యవాదాలని తెలిపారు. కన్నడతో పాటు దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉపేంద్ర. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఎన్నో సినిమాల్లో నటించి తనకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.