జాన్వి బైక్ రైడ్.. ఏ సినిమా కోసం?

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వి బైక్ నేర్చుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారు జాన్వి ఎంత ముద్దుగా.. వైనంగా బైక్ నేర్చుకుంటుందో కదా అనుకుంటున్నారు. హీరో సిద్ధార్థ్ మల్హోత్ర వెనుక కూర్చొని మరీ ముద్దుగుమ్మకు స్కూటీ పాఠాలు నేర్పిస్తున్నాడు. సినిమాల్లో నటించే నటీనటులకు ప్రతి ఒక్క హీరో,హీరోయిన్స్ కి 64 కళల్లో కొన్ని కళలైనా కచ్చితంగా వచ్చి ఉంటే తరవాత కాలంలో వారు నటించే సినిమాల్లో అవి ఎంతో కొంత ఉపయోగపడతాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో చాలామంది హీరోయిన్స్ గుర్రపు స్వారీలు, స్విమ్మింగ్, కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్, క్రికెట్, కబడ్డీ, కత్తి ఫైట్, కర్ర సాము, బాక్సింగ్ వంటి ఎన్నో కళలను నేర్చుకుని సినిమాల్లో నటించారు. ఎంతో కష్టపడి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అమ్మడు నేర్చుకునే బైక్ రైడింగ్ భవిష్యత్లో ఏ సినిమాలో కనిపిస్తుందో అని సినిమా లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే బైక్ రైడ్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన జాన్వీ ‘నేను రైడ్‌కి తీసుకెళ్తే పరమ్‌కి చాలా ఇష్టం’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. జాన్వీ, సిద్దార్థ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పరమ్ సుందరి’. తుషార్ జలోటా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ జూలై 25న విడుదలకు సిద్ధమవుతోంది. జాన్వీ షేర్ చేసిన ఫోటోలపై నెట్టింట గట్టిగానే స్పందన వస్తోంది. మొత్తానికి అమ్మడు స్కూటీ నేర్చుకోవడం మాటేమో కానీ.. ఆ ఫోటోలతో స్వామికార్యం.. స్వకార్యం నెరవేరినట్టుగా అయ్యింది. అంటే అమ్మడికి స్కూటీ రావడంతో పాటు ఈ ఫోటోలు ‘పరమ్ సుందరి’ ప్రమోషన్స్‌కు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. మరి ఈ స్కూటీ రైడ్ ‘పరమ్ సుందరి’ కోసమేనా? లేదంటే మరొక సినిమా కోసమా? అనేది తెలియాల్సి ఉంది.

శివ మల్లాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *