మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘తుడరుమ్’ విడుదలకు సిద్ధమైంది. ఎమోషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో దీపా ఆర్ట్స్ ద్వారా ఏప్రిల్ 26న విడుదల కానుంది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎం.రంజిత్ నిర్మించారు. ఎమోషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రోలర్ కోస్టర్ రైడ్‌గా ట్రైలర్ కట్టిపడేసింది.
ఈ సినిమాలో మోహన్ లాల్ ట్యాక్సీ డ్రైవర్‌గా నటించారు. ట్రైలర్ ప్రకారం చూస్తే ఈ సినిమా మొత్తం ఓ కారు, ఫ్యామిలీ చుట్టూ ఆసక్తికరంగా నడుస్తుంది. మోహన్‌లాల్ పెర్ఫార్మెన్స్, శోభనతో ఆయన కెమెస్ట్రీ అద్భుతంగా అనిపించింది. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మణియంపిల్ల రాజు,బిను పప్పు, ఇర్షాద్ అలీ, ఫర్హాన్ ఫాజిల్ , థామస్ మాథ్యూ, షైజో ఆదిమాలి తదితరులు కీలక పాత్రలు పోషించారు.