నాని బర్త్‌డే స్పెషల్‌ ఆర్టికల్‌…

తెలుగు హీరోలు శ్రీకాంత్, నితిన్, మంచు విష్ణుల సినిమాలకు అతను అసిస్టెంట్‌ డైరెక్టర్‌..

కట్‌చేస్తే 2025లో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ హీరో ఇన్‌ ఇండియా..

ఘంటా నవీన్‌ నానిగా మారి నేచురల్‌ స్టార్‌ నాని అయ్యారు. చిన్న చిన్నగా ఎదుగుతూ ఎంతో పెద్దగా మారాడు.

మన పక్కింటి కుర్రోడిలా సరదాగా అల్లరి చేస్తూ..

తోటి స్నేహితునిలా మాట్లాడుతూ ఉంటాడు..

ఎంతో నిజాయితీగా మాట ఇస్తే నిలబడతాడు..

వాల్‌పోస్టర్‌ బ్యానర్‌ని స్థాపించి నిర్మాతగా మారారు..

‘ఆ’ సినిమాతో ప్రశాంత్‌వర్మకి డైరెక్టర్‌గా అవకాశమిచ్చాడు..

‘హిట్‌’ కథను నమ్మి శైలేష్‌కు దర్శకుని టైటిల్‌ను ఇచ్చాడు…

తను హ్యాపిగా ఉంటూనే పక్కనున్న అందరూ ఎదగాలి అంటారు

మంచికొడుకు, సూపర్‌ తమ్ముడు, బెస్ట్‌ హస్బ్‌ండ్‌ నాని….

అన్నిటికంటే మించి తన కొడుక్కి ‘జెర్సీ’లు కొనిచ్చే ‘హాయ్‌ నాన్న’..

కొడుక్కి తన టైమ్‌ని శనివారమే ఇచ్చి ‘సరిపోదా శనివారం’’ అనే తండ్రి కాదు నాని…

తన ఫ్యామిలీకి ‘దసరా’ పండగ లాంటోడు….‘దసరా’తో వందకోట్ల క్లబ్‌కి ఎంట్రీ ఇచ్చాడు…

అందగాడు అందరివాడు నాని ‘అంటే సుందరానికి’లా సినిమా పిచ్చోడు..

అందుకే కాలేజికంటే ఎక్కువ అమీర్‌పేట సత్యం థియేటర్‌లో ఉండేవాడు..

‘‘అష్టాచమ్మ’’లాంటి ఆటలాడుతూనే ‘కబడ్డీ’ ఆడతాడు….

‘‘స్నేహితుడు’’గా ఉంటూ ‘రైడ్‌’ చేస్తాడు….

‘‘అలా మొదలైంది’’ అంటూ లవ్‌స్టోరీలు చేస్తాడు..

ఈ ‘పిల్ల జమీందార్‌’…నానిగా అంటూ ‘ఈగ’ చేశాడు.

ఆ టైమ్‌లో నానిని చూసిన వారికి ‘ఎటో వెళ్లిపోయింది మనసు’..అందుకే ‘మజ్ను’ అయ్యాడు.

‘జెంటిల్‌మెన్‌’లా బిహేవ్‌ చేయటం అలవాటు చేసుకున్నాడు…

ప్రేక్షకులకు ‘సెగ’ పుట్టించే ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’కు సై అని జై బాలయ్య అన్నాడు.

నాని ఫ్యాన్స్‌ మాత్రమే చూశారు..బాలయ్యఫ్యాన్స్‌ సర్లే అన్నారు..

‘పైసా’ల కోసం ‘ఆహాకళ్యాణం’, ‘జెండాపై కపిరాజు’కి ఓకే..

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లా ఉన్నాడే అనుకునేలోపు..

మతిమరుపు లక్కీలా ‘భలే భలే మగాడివోయ్‌’తో బ్లాక్‌బస్టర్‌..

అంతే..టైమ్‌ మారింది, లెక్కలు మారాయి..కట్‌ చేస్తే నాని రేంజ్‌ మారింది.. బ్రాండ్‌ మారింది..

‘నిన్నుకోరి’ అంటూ లవర్‌ని మిస్సయ్యాడు…‘నేనులోకల్‌’ అంటూ ఇక్కడిక్కడే తిరిగిన ‘ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ ‘దేవదాస్‌’ అయ్యాడు.

‘కృష్ణార్జునయుద్ధం’, ‘గ్యాంగ్‌లీడర్‌’ వర్కవట్‌ అవ్వలేదు..

ఇట్టాకాదనుకుని టక్‌ చేసి ‘టక్‌ జగధీష్‌’ అన్నాడు..నో అన్నారు.

లాభం లేదనుకుని ‘జెర్సీ’తో గేర్‌ మార్చాడు..సూపర్‌ అన్నారు..

ఫ్రెండ్స్‌కోసం సరదాగా అలా వచ్చి ఇలా వెళ్లే పాత్రలు చాలానే చేశాడు….

ఫ్రెండ్స్‌ కోసం చేశాడ్లే అని సరిపెట్టుకున్నారు.

కరోనా కాటేయటంతో మేజర్‌ యెండ్లూరి విష్ణు ‘వి’గా ఓటిటిల్లోకి మాత్రమే వచ్చాడు.

తర్వాత డ్యుయల్‌ రోల్‌లో వచ్చిన ‘ శ్యామ్‌ సింగరాయ్‌’ పరవాలేదనిపించాడు..

నిర్మాతగా నాణ్యమైన కథలనే ఎన్నుకున్నాడు..అందుకే వాల్‌పోస్టర్‌ గట్టిగానే నిల్చుంది..

ఎంత గట్టిగా నిల్చోకపోతే ఏ వాల్‌పోస్టర్‌పై మెగాస్టార్‌ని చూస్తూ పెరిగాడో అదే మెగాస్టార్‌తో అదే వాల్‌పోస్టర్‌ అనే బ్యానర్‌తో నిర్మాతగా సినిమా తీస్తున్నాడు..

మన కళ్లముందు ఒక మనిషి ఎదగటం అంటే ఇంతకంటే… ఏముంటుంది…

నాని నిజంగా ఎదిగాడు…నాని నీకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ విశెష్‌ తెలియచేస్తుంది ట్యాగ్ తెలుగు.కామ్ …..

హిట్‌–3తో మాస్‌ హీరోగా హిట్‌ కొట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

శివమల్లాల

Also Read This : టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సోనుధి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ…

Nani Birthday
Nani Birthday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *