రివ్యూ– సంక్రాంతికి వస్తున్నాం
విడుదల తేది– 14- 01–2025
నటీనటులు– వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నరేష్, సాయి కుమార్,వి ఐ టి గణేష్, ఉపేంద్ర, రేవంత్ , మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రజిత,అమిత్, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ , పృథ్వీ, పమ్మి సాయి తదితరులు
ఎడిటర్– తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ– సమీర్ రెడ్డి
సంగీతం– భీమ్స్ సిసిరోలియో
పాటలు- భాస్కర భట్ల, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్
నిర్మాత– శిరీష్
కథ– స్క్రీన్‌ప్లే–మాటలు-దర్శకత్వం– అనిల్ రావిపూడి
సినిమా కథ:
సింపుల్ కథతో రూపొందిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి వెంకటేష్ ల కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు సంక్రాతికి వస్తున్నాం సినిమా వారి కాంబినేషన్ తో మంచి హిట్ను అందుకుంది. చిన్న కథ తో వచ్చి రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ క్లైమాక్స్ లో గురుదేవోభవ అంటూ సూపర్బ్ మెసేజ్ ను అందించారు దర్శకుడు.
టెక్నికల్ విభాగం- సినిమా ఎలా తీశారు.
కామెడీ సినిమాలకు సంబంధించిన సన్నివేశాలు రాయటానికి రైటర్కి దర్శకునికి మంచి సింక్ ఉండాలి. ఆ విషయంలో దర్శకుడు అనిల్ కి ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే కథలో ఎలాంటి ట్విస్టులు టర్న్ లు లేకపోయినా ఉన్న కథ లోనే కంటెంట్ చెప్పే ప్రయత్నం చేశాడు. అనిల్ దర్శకత్వ ప్రతిభ కంటే నిర్మాతకు,హీరోకి ఈ కథ ను చెప్పి ఒప్పించటమే పెద్ద సక్సెస్ అని చెప్పాలి. గోదారి గట్టు మీద రామచిలకవే పాటతో సినిమా లోని పాటలు ఎలా ఉంటాయో భీమ్స్ తన మ్యూజిక్తో ఎంటర్ టైన్ చేసాడు. కొన్ని బిజియంస్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో కామెడీ పరంగా హైలైట్ అయిన రేవంత్ (బుల్లి రాజు) పాత్రలో ఉన్న చిన్న పిల్లోడు జనసేన పార్టీ ప్రచారంలో పాల్గొనడం మంచి యాక్టివ్గా అనిపించటంతో దర్శకుడు అనిల్ అతనిపై ఫోకస్ పెట్టి కరెక్ట్ కంటెంట్ ని క్రియేట్ చేశారు. అందుకే ఆ పిల్లోడు కి మంచి మార్క్స్ పడ్డాయి ప్రేక్షకుల నుండి. శ్రీను వైట్ల సినిమా రెడీ లో భరత్ ఏ రేంజ్ లో రెచ్చిపోయాడో సంక్రాంతి కి వస్తున్నాం సినిమా లో రేవంత్ అలా రెచ్చిపోయాడు. మీనాక్షి తన గ్లామర్తో ఐశ్వర్య తన నటనతో మెప్పించారు. సినిమా చూస్తున్నంతసేపు ఏదో సినిమాలో ఆ సీన్ కనిపించింది అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ మంచి సీన్ లను ఒక చోటకి చేర్చి దానికి తగ్గట్టుగా కథ స్క్రీన్ప్లే తయారు చేసుకోవటం కూడా పెద్ద సవాలే. ఆ సవాల్ ను స్వీకరించిన దర్శకుడు అనిల్ పర్ఫెక్టుగా మూవీని తెరకెక్కించారు. తమిళ దర్శకుడు అట్లీ ల అనిల్ కూడా అనేక సినిమాల్లోని కంటెంట్లను ఒక చోటకి చేర్చి ప్రేక్షకులను అలరిస్తారు. అట్లీల ,అనిల్ కూడా ఎక్కడ తగ్గకుండా సినిమాని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు.
ప్లస్ పాయింట్స్–
వెంకటేష్ నటన
హీరోయిన్స్ గ్లామర్ అండ్ కామెడీ టైమింగ్
గురువు గురించి చక్కని మెసేజ్
రేవంత్ డైలాగ్స్
ఉపేంద్ర,విఐటీ గణేష్ , పమ్మి సాయి, మురళీధర్ గౌడ్, నరేష్, సాయికుమార్ కామెడీ
మైనస్ పాయింట్స్–
చిన్న కథ
సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకోవటం
ఫైనల్ వర్డిక్ట్– కామెడీ ఎంజాయ్ చేసేవారికి పర్ఫెక్ట్ పొంగల్ ఫిల్మ్.
రేటింగ్– 3/5
శివమల్లాల