‘మా ఇంట్లో అత్త, అక్కలు వీణ వాయిస్తూ ఉండేవారు. అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని. అలా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చాను’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ.
ఆయన సంగీతాన్ని అందించిన పీరియాడిక్ వెబ్ సిరీస్ వికటకవి నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.
వైజాగ్‌లో పుట్టి పెరిగాను. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాను. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా 2011 నుంచి 2018వరకు జాబ్ చేశాను. ఉద్యోగం మానేసిన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఈ క్రమంలో నాకు మా ఫ్యామిలీ నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది.
మా ఇంట్లో అత్తలు, అక్క వీణ వాయిస్తూ ఉండేవారు. అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని. అలా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చాను.
ముందు గిటార్ నేర్చుకోవాలనుకున్నాను. అందుకని శరత్ మాస్టర్ దగ్గర రెండున్నర నెలల పాటు బేసిక్స్ నేర్చుకున్నాను. తర్వాత నాకు నేనుగా సొంతంగా ప్లే చేస్తూ నేర్చుకోవటం స్టార్ట్ చేశాను.
గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత కాస్త ఎక్కువ సమయం దొరికినట్లయ్యింది. కొన్ని సందర్భాల్లో అయితే కాలేజీలకు బంకులు కొట్టేసేవాడిని. అక్కడ మ్యూజిక్ బ్యాండ్స్‌తో కలిసి తిరగటం వల్ల మ్యూజిక్‌పై కాస్త పట్టు పెరిగింది.
2011 నుంచి 2018 వరకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే షార్ట్ ఫిల్మ్స్‌కు వర్క్ చేసేవాడిని. ఇలా చేయటం వల్ల నాకు మంచి ప్రాక్టీస్ దొరికినట్లయ్యింది. ఈ క్రమంలో ప్రదీప్ అద్వైత్ నన్ను జగన్నాటకం డైరెక్టర్ ప్రదీప్‌కు పరిచయం చేశారు.
నేను అంతకు ముందు చేసిన ఓ ముప్పై సెకన్ల మ్యూజిక్ బిట్ విని నాకు జగన్నాటకం మూవీలో చాన్స్ ఇచ్చారు. అలా సినీ ఇండస్ట్రీలోకి నా తొలి అడుగు పడింది. తర్వాత ఇండిపెండెంట్‌గా వర్క్ చేసుకుంటూ వస్తుండేవాడిని.
ఆ సమయంలో నా చిన్ననాటి స్నేహితుడు.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల నన్ను గూఢచారి సినిమాలో కీ బోర్డ్ ప్రోగ్రామింగ్ కోసం వర్క్ చేయమని అడగటంతో వర్క్ చేశాను. ఆ తర్వాత క్షీర సాగర మథనం, నేడే విడుదల, మిస్సింగ్, శ్రీరంగనీతులు సినిమాలకు వర్క్ చేశాను.
సినిమాలతో వెబ్ సిరీస్‌లైణ సేవ్ ది టైగర్స్ సీజన్1, సీజన్2లకు సంగీతాన్ని అందించాను. రీసెంట్‌గా వికటకవి సిరీస్‌కు వర్క్ చేశాను.
నేను సంగీతాన్నందించిన మిస్సింగ్ మూవీలో ఓ బీజీఎం బిట్ విన్న నిర్మాత బన్నీవాస్‌గారికి అది బాగా నచ్చింది. ఆయన ఆ సినిమాకు సంబంధించి ఓ ఈవెంట్‌కు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
తప్పకుండా కలిసి పని చేద్దామని ఆ సందర్భంలో బన్నీవాస్‌గారు చెప్పారు. అన్నట్లుగానే ఆయ్ సినిమాకు వర్క్ చేసే అవకాశాన్ని కల్పించారు. అయితే ముందగా అమ్మలాలో రామ్ భజన సాంగ్‌తో పాటు ఓ ఐటెమ్ సాంగ్‌కు సంగీతాన్ని ఇవ్వమని బన్నీవాస్‌గారు చెప్పారు.
నేను కూడా ఆ రెండు పాటలు కంపోజ్ చేసిచ్చాను. వారికి అవి బాగా నచ్చేశాయి. దాంతో మిగిలిన పాటలతో పాటు బీజీఎం వర్క్ కూడా చేయమని అన్నారు. అలా ఆయ్ సినిమాకు వర్క్ చేశాను. ఆయ్ వంటి కామెడీ మూవీకి బీజీఎం చేయటం మామూలు విషయం కాదు. అయితే సినిమా హిట్ అయినప్పుడు పడ్డ కష్టమంతా మరచిపోయాను.
డైరెక్టర్ ప్రదీప్ మద్దాలికి ఏం కావాలనే దానిపై పక్కా క్లారిటీ ఉంది. అందువల్ల నేను వికటకవి సిరీస్‌కు వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా కష్టపడలేదు. డైరెక్టర్సే నాకు గురువులు.
అందువల్ల డైరెక్టర్ ప్రదీప్ మద్దాలికి కావాల్సిన ఔట్‌పుట్ ఇస్తూ వెళ్లానంతే. ఆయ్ సినిమాకు వర్క్ చేసేటప్పుడే వికటకవి సిరీస్‌లో మూడు ఎపిసోడ్స్‌కు మ్యూజిక్ చేశాను. ఆయ్ రిలీజ్ తర్వాత మరో మూడు ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేశాను. వికటకవికి వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్.
నేను డైరెక్టర్స్ టెక్నిషియన్.. వాళ్లకి కావాల్సిన ఔట్‌పుట్ ఇవ్వటమే నా ప్రయారిటీ.. అది ఏ జోనర్ సినిమా అయినా, సిరీస్ అయినా మ్యూజిక్ చేయటానికి సిద్ధమే.
దేవిశ్రీ ప్రసాద్‌గారంటే నాకు చాలా ఇష్టం.ప్రస్తుతం త్రీరోజెస్ సీజన్ 2తో పాటు ఆహాలో మరో రెండు వెబ్ సిరీస్‌లకు వర్క్ చేస్తున్నాను. కొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటి వివరాలను తెలియజేస్తాను.
Also Read This : బద్రి సినిమాకి ఫస్ట్ డే ప్లాప్ టాక్ వచ్చింది