విజయశాంతి, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 18న విడుదలై మంచి సక్సెస్ బాటలో నడుస్తోంది. ఈ క్రమంలోనే విజయశాంతి మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ‘‘జీవితంలో మంచి సినిమా చేశామనే తృప్తి ఉంది. చాలా కాలం తర్వాత కాప్, మదర్‌గా ఒక పవర్ ఫుల్ పాత్ర చేశాను. ప్రస్తుతం యాక్షన్ అనేది నాకొక ఛాలెంజ్ అయినా కూడా చేశాను. సినిమాని అందరూ ప్రశంసిస్తున్నారు. తల్లిదండ్రులు, కొడుకుల అనుబంధానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మా సినిమాలో బలంగా చూపించాం. కథను దర్శకుడు సినిమాని హ్యాండిల్ చేసిన తీరు అద్భుతం. మహిళలు ఫోన్ చేసి మదర్ అండ్ సన్ ఎమోషన్ కట్టిపడేసిందని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది.
కల్యాణ్ బాబు చాలా మంచివాడు. అతనితో ఈ సినిమా కారణంగా మంచి బంధం ఏర్పడింది. గత జన్మలో తను నాకు బిడ్డేమో తెలియదు కానీ తనకి నాపై చాలా ఆప్యాయత ఉంది. ఆది నుంచి నా ట్రాకే సెపరేటు. ‘ప్రతిఘటన, నేటి భారతం, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ, మొండి మొగుడు పెంకి పెళ్ళాం..’ ఇలా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశాను. సినిమా కథ రాసినప్పుడే నా పాత్ర తీరును సైతం డైరెక్టర్‌గారు డిజైన్ చేసుకున్నారు. పోలీస్ పాత్రకు నేనైతే సరిగ్గా సరిపోతానని.. ఆ రకంగానే నా పాత్రను మలిచారు. కెరీర్ బిగినింగ్ నుంచి క్రమశిక్షణతో పని చేయడం అలవరుచుకున్నా. ఈ సినిమాలోని బురద యాక్షన్ సీక్వెన్స్ చలికాలలంలో తీశారు. చలికి వణికిపోయా. ఆ సీక్వెన్స్‌లో నైట్‌లో తీసినప్పుడు చేయడం చాలా ఛాలెంజింగ్ అనిపించింది. దానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా కోసం ఏడాది పాటు డైట్ పాటిస్తూ వర్కవుట్స్ చేశాను. కెరీర్ బిగినింగ్ నుంచి డెడికేషన్ క్రమశిక్షణతో
-నా కెరీర్ బిగినింగ్ నుంచి ఒక డెడికేషన్ క్రమశిక్షణతో వర్క్ చేయడం అలవర్చుకున్నాను. నిరంతరం ఏదో కొత్తదనం ఇవ్వడానికి ప్రయత్నించబట్టే ప్రజలు ఆశీర్వదించి సింహాసనం పై కూర్చోబెట్టారు. ప్రతిఘటన తర్వాత లేడీస్ సూపర్ స్టార్, లేడి జాకీ చాన్ పిలిచారు. డైరెక్టర్ గారు కథ చెప్పగానే మదర్ సన్ ఎమోషన్ నన్ను బాగా ఆకట్టుకుంది. గంతో నేను చేసిన యాక్షన్ తదితర సినిమాల విషయంలో ప్రేక్షకులు అంత సంతృప్తిగా లేరు. ఇంకేదో కావాలని కోరుకున్నారు. అలాంటి సమయంలో ఈ సినిమా వారిని సంతృప్తి పరుస్తుందనిపించింది. అలా ఈ సినిమా చేశాను. సినిమా క్లైమాక్స్ విని చాలా షాక్ అయ్యాను. కొత్తగా అనిపించడంతో పాటు హీరో అలా చేయడం తొలిసారి అనిపించింది. అసలు ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? అనిపించింది. కానీ దానిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు.