రాయదుర్గం టీ హబ్‌లో ‘ద సోషల్ మీడియా అండ్ ఫిలిం అవార్డ్స్’ కార్యక్రమం జరిగింది. టీఎస్ఎఫ్ 2025, 7వ ఎడిషన్ కర్టన్ రైజర్ కార్యక్రమానికి ఈ నెల 27 నుంచి మే 20 వరకు నామినేషన్ స్వీకరిస్తున్నట్లు కళారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు శ్రీనివాస్ మర్రి ప్రకటించారు. దీనిలో భాగంగా డిజిటల్ క్రియేటర్స్ ఫిలిం మేకర్స్ ఇతర డిపార్ట్మెంట్ నుంచి అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మామిడి హరికృష్ణ, అజయ్ రెడ్డి కొండా, శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ తాలూకా, వీరయ్య, మిథాలీ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.