పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్థరాత్రి భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. అసలు ‘ఆపరేషన్ సింధూర్’ ఏమిటి? ఎందుకు అలా పేరు పెట్టాల్సి వచ్చిందంటే.. దీనికి ఒక కారణముంది. సింధూర్ అంటే తెలుగులో కుంకుమ లేదంటే తిలకం అని అర్థం. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మందికి నుదుటున సింధూరం దూరమైంది. భారత మహిళల ఐదో తనానికి ప్రతీకగా ఈ చర్యకు ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టినట్టు సమాచారం. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాద శిక్షణ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం దాడులు చేసింది. వాటన్నింటినీ ధ్వంసం చేసింది. ఈ దాడిలో త్రివిధ దళాలు పాల్గొన్నాయి.