గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు.
ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అంజలి మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే..
అంజలి మాట్లాడుతూ.. ఏ యాక్టర్‌కి అయినా సరే సంక్రాంతికి సినిమా వస్తుందంటే ఆనందంగా ఉంటుంది.
గేమ్ చేంజర్, తమిళంలో విశాల్ చిత్రం రాబోతోంది.
ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను.
గేమ్ చేంజర్‌లో నా పాత్ర పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా పార్వతి. శంకర్ గారు కథ చెప్పినప్పుడు. మా అమ్మే గుర్తుకు వచ్చారు.
ఈ కారెక్టర్ నా నుంచి చాలా డిమాండ్ చేసింది. నేను కూడా అదే స్థాయిలో నటించానని అనుకుంటున్నాను.
శంకర్ గారు నా పర్ఫామెన్స్‌ను చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు.
ఇది నా కెరీర్‌లో ది బెస్ట్ కారెక్టర్ అవుతుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది.
పార్వతి పాత్ర కోసం నేనేమీ ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వలేదు. నా పాత్రలో సస్పెన్స్, ట్విస్ట్ ఉంటుందని శంకర్ గారు ఆల్రెడీ చెప్పారు.
కాబట్టి ఇంకా నేను ఆ కారెక్టర్ గురించి ఎక్కువగా చెప్పకూడదు.
అది థియేటర్‌లో ఆడియెన్స్ చూసినప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సెట్స్ నుంచి వచ్చినా కూడా ఈ పాత్ర చాలా రోజులు నన్ను వెంటాడుతూనే వచ్చింది.
నేను కూడా కథ విన్నప్పుడు నాకు నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాను.
అంతా అంటున్నట్టుగా అదే నిజమైతే అంతకంటే గొప్ప విషయం, సక్సెస్ ఇంకేం ఉంటుంది.
ఆ దేవుడి దయ వల్ల అది నిజం కావాలి. బయటే జరిగే సంఘటనలు, ఎదురైన అనుభవాల నుంచే ఏ యాక్టర్ అయినా కూడా తెరపై నటించేందుకు ప్రయత్నిస్తుంటారు.
కానీ ఈ సినిమాలోని కారెక్టర్, ఆ బ్యాక్ డ్రాప్ చాలా కొత్తది. నాకు ఇలాంటి ఘటనలు, మనుషులు ఎప్పుడూ ఎదురు కాలేదు. చాలా కొత్తగా అనిపించింది.
అందుకే ఈ పాత్రను పోషించేందుకు, నటనతో ఆడియెన్స్‌ను నమ్మించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. శంకర్ గారు నా పాత్ర గురించి చాలానే చెప్పారు.
నా పాత్రలో చాలా సోల్ ఉంటుంది. ఎక్కువగా రివీల్ చేయొద్దనే ట్రైలర్, టీజర్‌లో తక్కువ షాట్స్ పెట్టారు.
నా పాత్రను తెరపై చూసినప్పుడు ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు.
అప్పన్న, పార్వతీల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.
సంజు పిల్లలమర్రి
Also read this : కోట్ల బిజినెస్ నుండి సినిమాల్లోకి..