రేవంత్ రెడ్డికి ‘తారకరామం’ బహూకరణ

మహా నటుడు, ప్రజా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 102వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ‘తారకరామం’ పుస్తకాన్ని బహుకరించానని సీనియర్ జర్నలిస్ట్, రచయిత భగీరథ తెలిపారు . ఎన్‌టీఆర్ సెంటినరీ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో ఎన్‌టీ రామారావు శత జయంతి సందర్భంగా తన సంపాదకత్వంలో ‘శకపురుషుడు ‘ , ‘తారకరామం’ రెండు పుస్తకాలు వెలవడ్డాయన్నారు. తారకరామం పుస్తకాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆవిష్కరించారని భగీరథ చెప్పారు. మే 28 ఎన్‌టీఆర్ 102వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం వారి నివాసంలో కలసి ‘తారకరామం ‘ పుస్తకాన్ని బహుకరించానని ఆయన చెప్పారు . 1950 నుంచి 1995 మధ్యకాలంలో రామారావు ఇచ్చిన ఇంటర్వ్యూ లతో ఈ పుస్తకం రూపొందింది . ఎన్‌టీఆర్ జయంతి రోజు ‘తారకరామం’ ప్రత్యేక సంచికను బహుకరించినందుకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారని భగీరథ వెల్లడించారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *