మెగాస్టార్ కెరీర్‌కు పెద్ద ప్లస్ ఈ దర్శకుడే….
లైమ్‌లైట్‌లో ఉన్న ఏ దర్శకుడు కూడా ఏడాదికి ఒక సినిమా కూడా తీయలేని పరిస్థితిలో ఉన్న సంగతి మనమంతా చూస్తున్నాం. 1980లో సినిమా దర్శకునిగా మారిన ఈయన మాత్రం ఏడాదికి మూడు సినిమాల నుండి 9 సినిమాల వరకు దర్శకత్వం వహించి దాదాపు 90 శాతం సినిమాలు విజయాలు సాధించేవటంఏ మామూలు విషయం కాదు. అలాంటి గొప్ప దర్శకుడు మన తెలుగు చిత్రసీమలో ఎన్నో మరుపరాని విజయాలను తెలుగు హీరోలకు అందించి వారి ఎదుగుదలకు స్టార్‌డమ్‌కి తనదైన బాట వేశారని చెప్పక తప్పదు. సినిమాలు తీశారు నంబర్ పెరిగింది అనుకోవటానికి లేదు. ఆయన సినిమాలు చేసినవారంతా టాలీవుడ్‌లోని టాప్ హీరోలే. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తొలినాటి విజయాలన్ని ఎక్కువశాతం ఈ దర్శకుని ఖాతాలోనే ఉండేవంటే నమ్మి తీరాల్సీందే. ఒక్క చిరంజీవిగారితోనే 24 సినిమాలకు దర్శకత్వం వహించారీయన. అలాగే కృష్ణ, శోభన్‌బాబు, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున ఇలా అందరి హీరోలతో సినిమాలు చేపిన దర్శకుడీయన. ఇంత పెద్ద దర్శకుడు ఎవరో ఈ పాటికే మీరు అర్థమై ఉంటుంది. అవును మీరు అనుకున్నట్లే ఆ దర్శకుడు కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిగారు. ఆయన జన్మదినం జూలై ఒకటవ తేది. ఈ సందర్భంగా కోదండరామిరెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు.కామ్….
శివమల్లాల
Also Read This :కె. విశ్వనాథ్ చివరి చిత్రం.. 15 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి..