ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా రూపొందిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. వేసవిలో కూల్ లవ్ స్టోరీగా ఏప్రిల్ 11న ఈ సినిమా విడుదల కానుంది. డుయో నితిన్, భరత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ మంచి స్పందనను రాబట్టాయి. శనివారం ఈ చిత్రం నుంచి ‘ప్రియమార’ సాంగ్ వచ్చేసింది. ఈ పాటను రథన్ కంపోజ్ చేశారు. రాకేందు మౌలి రాసిన సాహిత్యం.. శరత్ సంతోష్, లిప్సిక భాష్యం వోకల్స్ ఈ మెలోడీని మరింత ఎలివేట్ చేశాయి. ఇక ప్రదీప్, దీపికల కెమెస్ట్రీ అయితే చాలా బాగుంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : వామ్మో.. నాస్తికుడినని చెప్పుకునే ఆర్జీవీ నవమినాడు గుడిలో ప్రత్యక్షం
