హీరో సిద్దు జొన్నలగడ్డ చేసిన సినిమాలు పెద్దగా లేకున్నా కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరో. మరి అదే కాన్ఫిడెన్సో లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సో కానీ ‘జాక్’ సినిమా చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలోనే కాస్త ఆలస్యమైనా కూడా గొప్ప నిర్ణయం ఒకటి సిద్దు తీసుకున్నాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం కోసం సిద్దు జొన్నలగడ్డ రూ.8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం.
ఈ సినిమా పరాజయంతో నిర్మాతలకు బాగా లాస్ వచ్చింది. ఈ లాస్‌ను భర్తీ చేయడం కోసం సిద్దు జొన్నలగడ్డ తన రెమ్యూనరేషన్ నుంచి సగం డబ్బును తిరిగిచ్చేయాలని డిసైడ్ అయ్యాడట. అంటే ఈ సినిమా కోసం సిద్దు రూ.4 కోట్లను తిరిగిచ్చేయనున్నాడని సమాచారం. ప్రస్తుతం సిద్దు ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నీరజా కోన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా సమాచారం. ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చేశాడని తెలుసుకున్న నెటిజన్లు.. సిద్ధు జొన్నలగడ్డపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల