సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో శ్రుతి హాసన్ ఒకరు. అభిమానులతో సమయం దొరికినప్పుడల్లా చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అభిమానులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా ఏమాత్రం తడుముకోకుండా, ఓపికగా ఆన్సర్ చేస్తూ ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు పర్సనల్ విశేషాలను పంచుకుంటూ ఉంటుంది. అలాంటి శ్రుతి హాసన్ తాజాగా పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే.. ఇక మీదట కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు శ్రుతి హాసన్ వెల్లడించింది.
తాజాగా శ్రుతి హాసన్ ఇన్‌స్టా గ్రాం వేదికగా తన ఫాలోవర్స్‌ను ఉద్దేశించి కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు పోస్ట్ పెట్టింది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకు ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందా? అని చర్చించుకుంటున్నారు. శ్రుతి హాసన్ మాత్రం కొద్ది రోజుల పాటు నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘కూలీ’ చిత్రంలో నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే నాగార్జున, ఉపేంద్ర, అమిర్‌ఖాన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.