‘కుబేర’ సెకండ్ గ్లింప్స్.. ప్రతి పాత్రా మిస్టీరియస్..

ధనుష్-నాగార్జున హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా ‘కుబేర’ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. గతంలో గ్లింప్స్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా సెకండ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ పేరిట విడుదలైన ఆ వీడియో, ప్రేక్షకులను కుబేర డార్క్ అండ్ హిప్నోటిక్ వరల్డ్‌లోకి తీసుకెళుతోంది. ఈ సెకండ్ వీడియో ద్వారా మేకర్స్.. సినిమాలోని కీలక పాత్రలతో పాటు వారు క్రియేట్ చేయబోయే తుఫానును అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ఆయనది బలమైన పాత్రే కాకుండా భావోద్వేగంతో.. విలువలతో కూడుకున్నట్టుగా కనిపిస్తున్నా కూడా ఏదో తెలియని అంతర్గత కోణం మరొకటి ఉందనిపిస్తుంది.

నాగార్జున పాత్రను మంచో చెడో అనలేని విధంగా రూపొందించటం సినిమా పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. ఈ టీజర్‌లో రష్మిక మందన్న, జిమ్ సర్భ్‌ల పాత్రలు కూడా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. ప్రతి పాత్ర కూడా మిస్టీరియస్‌గానూ.. డేంజరస్ గేమ్‌లో భాగమైనట్లుగా కనిపిస్తోంది. ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ రెగ్యులర్ టీజర్లకు భిన్నంగా, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా రూపొందించడం జరిగింది. శేఖర్ కమ్ముల దర్శక్తంలో రూపొందిన ఈ సినిమా చాలా ఆసక్తికరంగా రూపొందినట్టుగా తెలుస్తోంది. ఈ పాన్ ఇండియన్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా జానర్‌‌ని రిడిఫైన్ చేసేలా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించిన కుబేర చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషలలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *