రామాయణం, మహాభారతం కాన్సెప్ట్‌తో ఎన్ని చిత్రాలు వచ్చినా కూడా ప్రేక్షకుల ఆదరణ బాగా ఉంటుంది. బాలీవుడ్‌లో ‘రామాయణ’ చిత్రం తెరకెక్కనుందనే వార్తతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు మరింత పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రామాయణ రెండు పార్టులుగా రూపొందనుందన్న విషయం తెలిసిందే. ఈ రెండు భాగాలు కలిపి బడ్జెట్ రూ.1600 కోట్లని సమాచారం. తొలి భాగం వచ్చేసి రూ.900 కోట్లు కాగా.. రెండో భాగం రూ.700 కోట్లతో రూపొందనుందట.
ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ దేనికోసమంటే.. సరికొత్త ప్రపంచాన్ని మేకర్స్ ఈ సినిమా కోసం సృష్టించారట. దీనికి వేసిన సెట్స్‌కోసం భారీగా ఖర్చైందని తెలుస్తోంది. తొలి భాగం కోసం ఎక్కువ సెట్స్ వేయనున్నారట. దీనికి ఎక్కువ ఖర్చు కానుందట. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు రామాయణ ఇతిహాసాన్ని తెలియజేప్పేందుకు భారీగానే ఖర్చు చేస్తున్నారట. విజువల్ వండర్‌గా రామాయణం రూపొందనుంది. ఇక బడ్జెట్ పరంగా చూస్తే.. అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా ‘రామాయణ’ చరిత్ర సృష్టించనుంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీడియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తున్నారు.