‘విశ్వంభర’లో క్యారెక్టర్ గురించి ఇంట్రస్టింగ్ విషయం బయటపెట్టిన రాజీవ్ కనకాల

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల సైతం ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి రాజీవ్ ఆసక్తికర విషయాలను ‘ట్యాగ్ తెలుగు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘ఇంతవరకూ నేను అలాంటి క్యారెక్టర్ చేయలేదు. కొంతమంది ‘ఆ సినిమాలో డిఫరెంట్‌గా ఉన్నా.. ఈ సినిమాలో డిఫరెంట్‌గా ఉన్నా’ అని చెబుతుంటారు. వాస్తవానికి అంత డిఫరెంట్‌గా ఎవరూ ఉండరు. కానీ ఇందులో మాత్రం కచ్చితంగా చెప్పగలను. నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నేను కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తా.

ఈ సినిమా నాకు వశిష్ట గారి వల్ల వచ్చింది. ఎందుకంటే అంతకు ముందు ఆయన దర్శకత్వంలో ‘బింబిసార’ చేశాను. అయితే ఆ సినిమాలో నేను పూర్తి స్థాయిలో శాటిఫై చేయలేకపోయా. ఎందుకంటే ఆ సమయంలో నా చేయి కాస్త ప్రాబ్లమ్ ఉండటం వలన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా. దీంతో నా క్యారెక్టర్ అనుకున్న దాని కన్నా లిమిట్ అయ్యింది. ఆ సినిమా తాలూకు ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఎవరైనా ఎందుకులే అనుకుంటారు. కానీ ఆయన మాత్రం ‘విశ్వంభర’లో కూడా నేను చేయాలని అనుకున్నారు. నేను అదృష్టవంతుడిని. ఒకరోజు షూటింగ్ ఆయన ‘నీతో లవ్‌లో పడిపోయాను అన్న’ అన్నారు. మరో సినిమాలో ఇంకా మంచి రోల్ చేద్దాం అన్నారు. నాకు ‘విశ్వంభర’లో నా గెటప్పే ఇంట్రస్టింగ్ విషయం.. పైగా ఇబ్బందికర విషయం. ఉదయం 6:30కు గెటప్ వేసుకుంటే రాత్రి వరకూ షూటింగ్ జరిగేది. కొన్ని సార్లు నైట్ షూటింగ్ అయిపోయే వరకూ కనీసం తినే వాడిని కూడా కాదు.. కాబట్టి చాలా ఇంట్రస్టింగ్ అండ్ ఇబ్బందికర సిట్యువేషన్ ఇది’’ అని తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *