సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గేదెల రాజు’. ‘చూస్తే ఒకటే నిజం చూడకపోతే వంద అనుమానాలు’ అనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. శుక్రవారం రఘు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో రఘు చాలా సీరియస్ లుక్‌లో ఫెరోషియస్‌గా కనిపిస్తున్నారు. మోటూరి టాకీస్ పతాకంపై రఘు కుంచే సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవి ఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. వాణి రవికుమార్ మోటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల