పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ తాజాగా ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్ సెట్స్‌లో పవన్ కల్యాణ్ జాయిన్ అయ్యారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్‌లో జోష్ నెలకొంది. పవన్‌తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
ప్రజావాణి చీదిరాల