‘దేవర’ సినిమా ముగియగానే ఎన్టఆర్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. ఒకవైపు ‘వార్ 2’ అలా పూర్తయ్యీ అవకముందే.. ప్రశాంత్ నీల్‌తో సినిమాను మొదలు పెట్టేశాడు. ఇప్పుడు ఈ స్టార్ హీరోకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరూ ఊహించని.. ఇప్పటి వరకూ చేయని ఓ పాత్రను ఎన్టీఆర్ చేయబోతున్నాడని టాక్. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవితాధారంగా సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో దాదాసాహెబ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నాడట.
‘మేడ్ ఇన్ ఇండియా’ అనే చిత్రాన్ని రూపొందించనున్నట్టు గతంలో దర్శకదీరుడు రాజమౌళి ప్రకటించారు. ఈ సినిమాను రాజమౌళి సమర్పణలో నితిన్ కక్కర్ తెరకెక్కించనున్నారు. రాజమౌళి తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మించనున్నారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఇది రూపొందనుందట. ఈ సినిమాలో ప్రధాన పాత్ర విషయమై ఎన్టీఆర్‌ను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ సినిమా కథ విషయానికి వస్తే. భారతీయ సినిమా పుట్టుక.. అది ఎదిగిన తీరును చూపించనున్నారట. సుదీర్ఘ చర్చల మీదట సినిమా స్కిప్ట్‌ను కూడా లాక్ చేశారని సమాచారం.