బుల్లితెర నుంచి వెండితెరపైకి ఒక అద్భుతమైన జర్నీ కొనసాగించిన నితిన్, భరత్ గురించి చెప్పేముంది? బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిందే. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా ‘ఇక్కడ అమ్మాయి – అక్కడ అబ్బాయి’ సినిమాను తెరెకెక్కించారు. ఈ చిత్రంలో దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇందులో మంచి డ్యాన్స్ నంబర్స్ ఉన్నాయని నితిన్, భరత్ తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో శేఖర్ మాస్టర్ చేస్తున్న కొరియోగ్రఫీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆయన కొరియోగ్రఫీ చేసిన చిత్రాలన్నింటిలో పెడుతున్న హుక్ స్టెప్స్ ఇంటిల్లిపాదీ కూర్చొని చూసేలా లేవంటూ విమర్శలొచ్చాయి. దీనిపై నితిన్, భరత్‌లను ‘మీ సినిమాలో కొరియోగ్రఫీ అందించడానికి ముందు ఇలాంటి హుక్ స్టెప్స్ పెట్టవద్దని ఏమైనా సూచనలిచ్చారా?’ అని విలేకరి ప్రశ్నించగా.. వారిద్దరూ ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘బై గాడ్ గ్రేస్ మేము అంతకు ముందే షూట్ చేసుకున్నాం. శేఖర్ మాస్టర్ టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్. ఎప్పుడూ మనిషి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తే కొన్నిసార్లు మిస్ ఫైర్ అవుతాయి. ఇవన్నీ ఇంటెన్షనల్‌గా చేసినవి కాదు.. మిస్ ఫైర్ అయ్యాయి’ అని తెలిపారు. ఈ సినిమాలో హుక్ స్టెప్స్ ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘అలాంటివేమీ లేవు. ఇప్పటి వరకూ విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది’ అని నితిన్, భరత్ వెల్లడించారు.
Also Read This :పవన్ టైటిల్ అని కాదు.. సినిమాకు యాప్ట్ అవుతుందని తీసుకున్నాం: నితిన్, భరత్