కోటా శ్రీనివాసరావు.. ఈ పేరు వినిపించక రెండేళ్లవుతోంది. చివరిగా 2023లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ చిత్రంలో కనిపించారు. అయితే ఆ సినిమా ఎప్పుడు వచ్చి వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియదు. ఒకరకంగా చెప్పాలంటే ప్రేక్షకులు ఆయన్ను చూడక చాలా కాలమే అవుతోంది. తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్.. కోటా శ్రీనివాసరావును కలిసి ఆయనతో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కోటా శ్రీనివాసరావు అంతలా మారిపోయారు.
‘కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు.. కోటా బాబాయ్‌ని కలవడం చాలా సంతోషాన్నిచ్చింది’ అని బండ్ల గణేశ్ పోస్ట్ పెట్టారు. ఆ ఫోటోలో కోటా గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. వృద్దాప్యంతో పాటు ఆయనెందుకో చాలా సన్నగా అయిపోయారు. పైగా పాదానికి కట్టుతో కనిపించారు. దీంతో ఆయనకు ఏమైందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 1978లో చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’తోనే కోటా కూడా నటుడిగా వెండితెరపై అడుగు పెట్టారు. ఆ తరువాత పలు భాషల్లో వివిధ రకాల పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.