బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో నారా రోహిత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలను సైతం పంచుకున్నారు. ‘ఎన్నికల సమయంలో రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా కనిపించిన మీరు.. సినిమాల్లోకి రారేమో అనుకున్నాం. కానీ మళ్లీ సినిమాలు చేస్తున్నారు.. భవిష్యత్‌లో ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళతారా?’ అని ప్రశ్నించగా.. ‘అప్పట్లో నా అవసరం ఉందని చెప్పి రాజకీయాల్లో తిరిగాను. నేను పుట్టి పెరిగిందంతా రాజకీయ కుటుంబంలోనే.. ఒకవేళ ఫ్యూచర్‌లో నాకు రాజకీయాల్లోకి రావాలనిపిస్తే ముందు మా పెద్దనాన్న (సీఎం చంద్రబాబు) గారికి చెప్పి ఆ తరువాత మీకే చెబుతా’ అన్నారు.
ఇక ‘భైరవం’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘ముందుగా నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు ఈ కథ గురించి ఫోన్ చేసి చెప్పారని.. ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. శశి కుమార్ క్యారెక్టర్ గురించి చెప్పారు. దీనికి ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాల్ చేసి ‘గరుడ’ చూడమన్నారు. నేను సినిమా చూశాను. చాలా నచ్చింది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. తమిళ్‌లో దీన్ని ఒక రస్టిక్ విలేజ్ డ్రామాలా చేస్తే దీనిని తెలుగు నేటివిటికి తగ్గట్టు మార్పులు చేశారు. ఇక మనోజ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి తెలుసు. అలాగే సాయి శ్రీనివాస్‌తో 2010 నుంచి పరిచయం ఉంది. మా ముగ్గురిలో ప్రతి క్యారెక్టర్‌కి ఒక ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. గత సినిమా విడుదల తర్వాత చిన్న బ్రేక్ తీసుకోవాలనుకుంటే.. అది కాస్త పెద్ద బ్రేక్ అయింది(నవ్వుతూ). ఇకపై రెగ్యులర్ గా సినిమాలు వస్తాయి. సుందరకాండ ఆల్మోస్ట్ పూర్తయింది. జూలైలో రిలీజ్ ఉండొచ్చు. నెక్స్ట్ ఫిల్మ్ ఆగస్టులో స్టార్ట్ చేయబోతున్నాను. మనోజ్ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. ఈ సినిమాతో చాలా పర్సనల్ బాండ్ వచ్చింది. సాయి నాకు 2010 నుంచి తెలుసు. ఈ సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాకి మేజర్ హైలైట్. చాలా రోజుల తర్వాత ఇంత హెవీ యాక్షన్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. మేము ముగ్గురు కలిసి చేసిన ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
ప్రజావాణి చీదిరాల